Rare pictures

కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ.. తన సోదరులతో

భువన విజయం ప్రదర్శనకు సంబంధించిన అరుదైన చిత్రం

భువ‌న విజ‌యం – తిమ్మ‌రుసు – ఉష‌శ్రీ శైలి.

భువ‌న విజ‌యం.. ఇదొక సాహిత్య ప్ర‌క్రియ‌. 16వ శ‌తాబ్దంలో కృష్ణదేవ‌రాయల‌ ఆస్థానంలో అష్ట దిగ్గ‌జాలు కొలువుదీరి నిర్వ‌హించిన‌ సాహిత్య గోష్టే భువ‌న విజ‌యం. ఆ త‌ర‌వాత అది కొంత‌కాలం క‌నుమ‌రుగైంది. అదే ప్ర‌క్రియ‌ను తిరిగి ఉష‌శ్రీ ప్రారంభించి ఈ శ‌తాబ్దంలో అద్యుల‌య్యారు. తొ లిసారిగా ఉష‌శ్రీ స్వ‌స్థ‌లం ఆల‌మూరులో ఆధునిక భువ‌న విజ‌యాన్ని నిర్వ‌హించారు. ఉద్దండులైన విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ, జ‌మ్మ‌ల‌మ‌డ‌క మాధ‌వ‌రామ శ‌ర్మ‌, వెంప‌రాల సూర్య‌నారాయ‌ణ‌ వంటి వారు ఇందులో పాల్గొన్నారు. ఇది 1956కు పూర్వం ప్రారంభించి సుమారు నాలుగు ద‌శాబ్దాల పాటు వంద‌ల సంఖ్య‌లో భువ‌న విజ‌యాల‌ను ప్ర‌ద‌ర్శించారు. తెలుగు రాష్ట్రం న‌లుచెర‌గులాఈ ప్ర‌క్రియ‌ను ఆవిష్క‌రించారు. మీరు చూస్తున్న‌ చిత్రం ఆకాశ‌వాణి త‌ర‌ఫున ప్ర‌సారం చేసిన భువ‌న విజ‌య కార్య‌క్ర‌మానికి సంబంధించిన‌ది. చిత్రంలో కుడి నుంచి శ్రీ‌యుతులు 1. ఏలూరిపాటి అనంత‌రామయ్య 2. ఆచార్య బేత‌వోలు రామ‌బ్ర‌హ్మం 3. శ‌న‌గ‌న న‌ర‌సింహ స్వామి 4. పేరాల భ‌ర‌త శ‌ర్మ 6. ఉష‌శ్రీ 9. ధారా రామ‌నాథ‌శాస్త్రి 10. గుండ‌వ‌ర‌పు స‌త్య‌నారాయ‌ణ. భువ‌న విజ‌య ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో ఉష‌శ్రీ తిమ్మ‌రుసు పాత్ర పోషించారు. శ్రీ‌కృష్ణ దేవ‌రాయ ఆస్థానంలో ఆయ‌న మ‌హా మంత్రి క‌దా. అన్ని అంశాల‌నూ స‌మ‌న్వ‌యం చేసిన‌ట్లే.. భువ‌న విజ‌యాన్ని తిమ్మ‌రుసు పాత్ర‌లో ఉష‌శ్రీ నిర్వ‌హించారు. ఆనాటి సాహితీ గోష్ఠులే వేరుగా ఉండేవి. ఆద్యంతం అద్భుతంగా సాగేవి. అందుకు స‌జీవ తార్కాణ‌మే ఉష‌శ్రీ నిర్వ‌హించిన ఆధునిక భువ‌న విజ‌యాలు.

ప్రజాకవితో జాతీయ నేత

దేశ ప్రధానమంత్రిగా భారత్ ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన మహానాయకుడు, కవి, పండితుడు పీవీ నరసింహరావు.. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావుతో ఉన్న అరుదైన చిత్రం.

తంజావూర్ సరస్వతీ మహల్

తంజావూర్ సరస్వతి మహల్ లో అత్యంత అరుదైన తంజావూరు పెయింటింగ్ దాని ముందున్న సరస్వతీ దేవి విగ్రహం. ఇక్కడి సరస్వతీ దేవి విగ్రహం చేతిలో వీణ కనిపించదు. వీణ లేని సరస్వతీదేవి విగ్రహమిది.

తంజావూర్ సరస్వతి మహల్

దేశంలో అత్యంత అరుదైన గ్రంథాలయం ఇది. ఈ గ్రంథాలయంలోని తెలుగు తాళపత్రాళ విభాగమిది.  నన్నెచోడుని కుమార సంభవం ఒకే ప్రతి సరస్వతి మహల్ లో ఉన్నది. ఇక్కడ తాళ పత్రాళను మూడు సంవత్సరాలకోసారి లైమ్ గ్రాస్ లేపనంతో పరిరక్షిస్తున్నారు.

సాహిత్యమూర్తులు

విశాఖపట్నం ఉడ్ ల్యాండ్స్ లో 1935 లో తీసిన ఫొటో ఇది. ఇందులో ముందువరుసలో కూర్చున్నవారు అడవిబాపిరాజు, ఆయన పక్కనే ఉన్నవారు దుర్గాబాయ్ దేశ్ ముఖ్.. వారితో పాటు మిగతా సాహిత్యవేత్తలున్నారు.

తిక్కన స్మారకం

కవిబ్రహ్మ తిక్కన సోమయాజి మహాభారత ఆంధ్రీకరణ చేసిన ప్రదేశం ఇది. ఇక్కడే ఉండి ఆయన భారతాన్ని రాశారని చెప్తారు. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు లోని పెన్నా నది తీరంలో ఇది ఉన్నది. నెల్లూరు శ్రీరంగనాథస్వామి దేవాలయానికి కూతవేటు దూరంలోనే ఇది ఉంటుంది.

బృహదీశ్వరాలయం

తంజావూరులోని ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన బృహదీశ్వరాలయం ఇది. దాని ముందు ప్రఖ్యాత సాహిత్యవేత్త ఆచార్య సుప్రసన్నాచార్య.

ప్రజాకవితో జాతీయ నేత

దేశ ప్రధానమంత్రిగా భారత్ ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన మహానాయకుడు, కవి, పండితుడు పీవీ నరసింహరావు.. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావుతో ఉన్న అరుదైన చిత్రం.

మల్లీశ్వరి స్కెచ్

తెలుగుసినిమా చరిత్రలో మకుటాయమానంగా నిలిచిన మల్లీశ్వరి సినిమాకు సంబంధించిన పెన్సిల్ స్కెచ్ ఇది. ఈ చిత్రంలో కనిపిస్తున్న ప్రదేశం మల్లి, నాగరాజు తరచూ కలుసుకునే ఆలయం. కళాదర్శకుడు కీర్తిశేషులు ఏకే శేఖర్ ఇలాంటి స్కెచ్ లు ఎన్నో వేశారు. ఒక సెట్ దాదాపు అయిదారు కోణాల్లో వేసేవారు. స్కెచ్ ఓకే అయితే అలాగే అది సెట్ గా రూపొందేది. మల్లీశ్వరికి కావలసిన సెట్లన్నింటికీ రెండేండ్లకు ముందునుంచే శేఖర్ స్కెచ్ లు వేసేవారు. పాత్రలకు సంబంధించిన స్కెచ్ లు కూడా వేసారు. ఆ పాత్రలకు సంబంధించిన ఆభరణాలు, దుస్తుల స్కెచ్ లు కూడా శేఖర్ వేశారు.

పీవీతో సుప్రసన్న

1982లో వరంగల్ లో పోతన పంచశతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దేశవ్యాప్తంగా మహామహులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఒకానొక సదస్సులో మధ్యాహ్నం 2 గంటలకు బమ్మెర పోతనపై అప్పటి విదేశాంగ మంత్రి పీవీ నరసింహరావు కీలకోపన్యాసం చేయాల్సి ఉన్నది. మొదట ఆయన తాను అలసిపోయానని.. అసలు ఏమీ ప్రిపేర్ కాలేదని.. మాట్లాడలేనంటూ అతిథి గృహానికి వెళ్లి నిద్రపోయారట. ఆ సమావేశాల నిర్వాహకులైన ఒకరైన పీవీ సోదరుడు పాములపర్తి సదాశివరావు, కోవెల సుప్రసన్నాచార్య అతిథి గృహానికి వెళ్లి పీవీని ఒప్పించి రప్పించారు. ఆ సదస్సులో కీలకోపన్యాసం చేసిన పీవీ ఏమాత్రం ప్రిపేర్ కాకుండానే దాదాపు గంటకు పైగా బమ్మెర పోతనపై అనర్గళంగా మాట్లాడారు. ఆ సందర్భంలోనిదే ఈ ఫొటో.. ఇందులో పీవీ నరసింహరావుతోపాటు, పాములపర్తి సదాశివరావు, మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి, ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య ఉన్నారు.

error: Content is protected !!