జలలోకాలు.
కోవెల సంతోష్ కుమార్

మహాలక్ష్మీదేవి ఎక్కడ పుట్టిందో మీకు తెలుసా? సముద్రంలో.. పాల సముద్రాన్ని దేవతలూ, రాయసులూ చిలికినప్పుడు అందులోంచి సిరుల తల్లి లక్ష్మీదేవి జన్మించింది. ఆమె తండ్రి సముద్రుడు.. ఆయన రాజ్యం సముద్రంలోపల ఉంటుంది.. అక్కడే అమ్మ పుట్టింది.. పెరిగింది.. క్షీరసాగర మధనవేళకు బయటకు వచ్చి విష్ణుమూర్తిని పెళ్లాడింది.. ఇదంతా పురాణాలు మనకు చెప్తున్న కథలు.. నిజంగా సముద్రంలో లోకాలు ఉన్నాయా? నీటి అడుగున మరో ప్రపంచం దాగి ఉందా? అది సాధ్యమేనా? అవును.. సాధ్యమే.. నీటి అడుగున మరో లోకం ఉంది.. మహా నగరాలు ఉన్నాయి. మనకు ఇప్పుడు కనిపిస్తున్నాయి.
సముద్రం లోతుల్లో ఏముంది? ఇది చాలా మందికి వచ్చిన ప్రశ్నే.. కానీ, ఎక్కువ మందికి జవాబు అక్కర్లేని ప్రశ్న.. నాచు.. పీచు.. చేపలు, తిమింగళాలు.. ఇలాంటివి తప్ప ఇంకేముంటాయి? కాబట్టి జవాబు అవసరం లేదు.. కానీ, ఈ సముద్రం లోతుల్లో మహాలోకాలు ఉన్నాయి.. ఒక కొత్త ప్రపంచమే దాగి ఉంది. మహా నగరాలే నిర్మాణమై ఉన్నాయి.. ఇది నిజం.. మొదటి ప్రశ్నకు జవాబు కోసం వెతికిన కొద్ది మంది నిగ్గుతేల్చిన నిజమిది. అండర్ వాటర్ ప్రపంచం ఆవిష్కారమైంది.. ఈ ప్రపంచం ప్రాచీన మానవ నాగరికతకు సంబంధించిందా? లేక మన పురాణాలు చెప్తున్నట్లు సముద్రుడి సామ్రాజ్యమా? ఈ లోకాల్లోనే సిరి నివాసమై ఉందా?
సముద్ర గర్భంలో
అత్యంత పురాతనమైన కట్టడాలు..
అయిదు సముద్రాల లోతుల్లో
అంతులేని ప్రపంచం
నీటి అడుగున దాగున్న మహానగరాలు
జల లోకాలలో 200 నగరాలు
మానవ నాగరికతకు
తొలినాటి ఆనవాళ్లు
విచిత్రమైన రాతి నిర్మాణాలు..
అద్భుతమైన పరిజ్ఖానం
రాతియుగం నాటి నగరాలు
ఎవరు నిర్మించినవివి?
ఎలా రూపొందాయి?
రాళ్లతో నిప్పు పుట్టించుకున్న కాలంలో
నిర్మాణ నైపుణ్యం ఎవరిది?
ఎవరో భూమిపైకి దిగి వచ్చారు
వాళ్ల విజ్ఞానాన్ని అందించారు
మహా నగరాల నిర్మాణానికి
సహకరించారు
ఎవరు వాళ్లు?
దేవతలా?
గ్రహాంతర వాసులా?
ఈ నగరాలు నీటిలోతుల్లో ఎలా సాధ్యమయ్యాయి?
రాముడు వంతెన కట్టినట్లే
ఈ నగరాలను
సముద్రంలో నిర్మించారా?
ఏమిటీ దేవరహస్యం?
భూమిపై 71శాతం సముద్రమే ఉంది. ఈ సాగరగర్భంలో ఇప్పటి వరకు మనిషి కనుక్కోలేని రహస్యాలెన్నో దాగున్నాయి. మనం సముద్రం నుంచి సహజవాయు నిక్షేపాలను బయటకు తీయటాన్నే తెలుసుకున్నాం.. కానీ, ఇప్పుడు మనకు లభించిన అధునాతన టెక్నాలజీ, డీప్ వాటర్ వరల్డ్‌ను మధించి శోధిస్తున్నాయి. క్షీరసాగర మధనంలో ఒక్కో సంపద బయటపడినట్లే.. ఈ సాగర శోధన ఓ కొత్త లోకాన్ని ఆవిష్కరిస్తోంది. విస్మయం గొలిపే ఆవిష్కరణ.. నీటి లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ.. అద్భుత నిర్మాణాలు.. సొఫిస్టికేటెడ్ కాంప్లెక్స్‌లు, జీవుల మనుగడకు ఉపయోగపడే చాలా చాలా వస్తువులు.. ఆశ్చర్యం.. విచిత్రం.. అద్భుతం..అపూర్వం.. ఎన్ని మాటలన్నా సరిపోదు.. దేనితోనూ పోల్చటం సాధ్యంకాదు..
అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ఓషనాలజీ పరిశోధకులు చేసిన ప్రయోగంలో వెలుగుచూసిన నిజాలివి.. సాగర గర్భంలో వందల కొద్దీ నగరాలు బయటపడ్డాయి. పది నుంచి పాతిక వేల సంవత్సరాల నాటి మానవ జీవిత అవశేషాలు వెలుగు చూశాయి.. ఇదే విచిత్రం… పాతిక వేల సంవత్సరాల నాడు మనుషులు నీటిలోపల కూడా జీవించారా?
సముద్రం లోపల మనుషులు జీవించారా? లేక ఇతర జీవులు నిర్మించుకున్నవా ఇవి? దీనికి జవాబు చెప్పటం కష్టమే.. ఇతర లోకాల జీవుల గురించి మనకు స్పష్టమైన ఆధారాలు ఏమీ లేవు. మనుషులే ఉన్నారని భావిస్తే.. సముద్రం లోపల జీవించి ఉండటం మనకు తెలిసినంత వరకు సాధ్యం కాని పని.. అయితే.. ఈ నగరాలు ఏమిటి? ఎలా వచ్చాయి? ఇదో పెద్ద మిస్టరీ…
సైంటిఫిక్ థియరీ ప్రకారం, ఐస్‌ఏజ్… భూమిపై పూర్తిగా మంచు కప్పుకుని ఉన్న కాలం.. ఈ ఐస్ ఏజ్ ముగింపు పాతిక వేల సంవత్సరాల క్రితం ప్రారంభమై పదివేల సంవత్సరాల క్రితం ముగిసినట్లు ఇవాళ్టి సైంటిస్టుల ఓ అంచనా. భూమిపై తొలినాళ్లలో సముద్ర మట్టం తక్కువ లెవల్‌లో ఉండేది.. ఐస్ ఏజ్ ముగిసిపోయిన సందర్భంలో సముద్ర మట్టం విపరీతమైన స్థాయిలో పెరిగింది. దీని వల్ల దాదాపు పది మిలియన్ చదరపు మైళ్ల మేర భూభాగం సముద్ర గర్భంలో కలిసిపోయింది.. దీని వల్లే అనేక నగరాలు జలసమాధి అయి ఉండవచ్చు.. ఇది సైన్స్ చెప్తున్న కొన్ని వాదనలు..
ఈ వాదనలే నిజమని కాసేపు భావిస్తే, మనిషి పట్టణ నాగరికతకు అలవాటు పడి పదివేల సంవత్సరాలకు పైగానే అయిందని విశ్వసించాలి. ఎందుకంటే నీటిలోపల బయటపడ్డ నగరాలన్నీ ఇప్పటి పట్టణాలకు కానీ, నగరాలకు కానీ, ఏమాత్రం తీసిపోని కట్టడాలు.. ఇది నిజమేనా? మనిషి నాగరికత అంత ప్రాచీనం కాదనుకుంటే, మరి ఎవరు కట్టిన పట్టణాలివి? ఎవరు జీవించిన సిటీలు ఇవి.. మనిషికి మానవేతరులు సాయం చేసి ఈ ప్రపంచానికి ఒక రూపం అందించారని అనుకోవాలా? ఏమిటీ నిజం?

సముద్ర గర్భంలో వెలుగుచూసిన నగరాల్లో లెజెండ్ సిటీ అట్లాంటిస్.. ఇది నిజంగా దేవతల నగరం. దేవతలు స్వయంగా తమ కోసం నిర్మించుకున్నారా అన్నంత అందమైన నగరం. అందానికే అందం.. సాటిలేని నిర్మాణం.. మన తరానికి అంతుపట్టని టెక్నాలజీ.. వర్తులాకార నగరం పదివేల సంవత్సరాల క్రితమే ఎలా సాధ్యమైంది.. ఇది నిస్సందేహంగా మనిషి నిర్మించింది కాదు.. మనం అనుకునే దేవతలు.. సైన్స్ అనుకునే గ్రహాంతర వాసులు.. ఈ మహానగర నిర్మాతలు. క్రీస్తుపూర్వం 360 సంవత్సరం.. ప్రఖ్యాత తత్త్వవేత్త ప్లేటో రెండు పుస్తకాలు రచించాడు.. అప్పటికి అట్లాంటిస్ ఆనవాలు కూడా లేదు. కానీ, ప్లేటో పుస్తకాలు ఈ అపూర్వ నగరం గురించి విస్తృతంగా చర్చించింది.. అప్పుడు దీని గురించి నమ్మిన వాళ్లు లేరు.. ఇప్పుడు దీన్ని చూసి అబ్బురపడని వాళ్లు లేరు. ప్లేటో అంచనా ప్రకారం అట్లాంటిస్ నగరం తన కాలానికి పదివేల సంవత్సరాలకు పూర్వం ఉన్నది.. ఎంత గొప్ప నగరం.. పెద్ద పెద్ద రాజ భవనాలు.. విశాలమైన వీధులు.. వ్యాపార సముదాయాలు.. చూస్తున్న కొద్దీ చూడాలనిపించే మహానగరం అట్లాంటిస్. గ్రీక్ ప్రాచీన చరిత్ర ప్రకారం అట్లాంటిస్ ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళం ఉన్న నగరం..ప్రపంచంలోని మిగతా ప్రాంతాలతో కమ్యునికేషన్‌కోసం.. తమ ఆత్మరక్షణ కోసం ఈ నౌకాదళమే కీలకంగా ఉపయోగపడింది. ఈ నగరాన్ని మనుషులు నిర్మించలేదన్నది ప్రగాఢ విశ్వాసం గ్రీకుల దేవుడు పొసైడెన్ తన మహిమతో అట్లాంటిస్‌ను నిర్మించాడు. గ్రీకుల విశ్వాసం ప్రకారం ఇతను సముద్ర దేవుడు మన పురాణాల ప్రకారం సముద్రుడే ఈ పొసైడెన్. తొలుత ఆకాశం నుంచి ఇతర దేవతలతో కలిసివచ్చి సముద్రంపై ఈ మహానగరాన్ని నిర్మించాడు. ఇతను ఓ ఏంజిల్ కోసం ఈ నగరాన్ని నిర్మించాడు.. ఓ యంగ్ బ్యూటిఫుల్ గర్ల్ కోసం రూపొందించాడీ నగరాన్ని.. నగరాన్ని నిర్మిస్తున్న సమయానికి ఈ ఏంజిల్ గర్భవతి అట.. ఆమెకు, ఆమె కుటుంబానికి రక్షణ కోసం ఈ నగరాన్ని ఆవిష్కరించాడు పొసైడెన్. ప్లేటో లెక్క ప్రకారం జీబ్రాల్టర్ రాక్‌పై అట్లాంటిస్ ఉంది.. స్పెయిన్ మొరాకోల మధ్యన అట్లాంటిక్ మహా సముద్రంలో ఈ నగరం ఉంది. 1968లో రీసర్చర్స్ దృష్టిలో అసహజంగా ఉన్న రాతి నిర్మాణాలు సముద్రం మధ్యలో కనిపించాయి. నీటి అడుగున ఉన్న ఈ నిర్మాణాలను గమనిస్తూ పోతే అట్లాంటిస్ మహానగరం వెలుగు చూసింది.
మొట్ట మొదట వీటిని బీచ్ రాక్‌గా అనుకున్నారు. కానీ, ఈ రాళ్లు ఒకదానితో ఒకటి క్రమ పద్ధతి ప్రకారం ఏర్పాటు చేసి ఉండటం.. రహదారుల మాదిరిగా దారులు ఉండటం.. ఒక వైపు నుంచి మరో వైపు దారులు ఉండటం.. విస్తారమైన రాతి నిర్మాణాలు అట్లాంటిస్ నాగరికతకు దర్పణంగా నిలిచాయి.. ఇతి పెద్ద రాళ్లు.. దీర్ఘచతురస్రాకారంలో వందల టన్నుల బరువున్నవి ఒకదానితో మరొకదాన్ని కలిపి ఉంచుతూ ఏర్పాటు చేసిన నిర్మాణాలు.. నిజంగా అపూర్వం.. బిల్డింగ్‌లు, సొరంగాలు.. పిరమిడ్‌లు.. అబ్బో.. ప్లేటో వర్ణించిన దానికి వందరెట్లు గొప్పనైన నగరం ఈ సముద్రుడు నిర్మించిన అట్లాంటిస్.

అట్లాంటిస్ నగరం మానవ నిజంగానే మానవ నిర్మితం కాదా? రాతియుగంనాడు మానవుడికి ఇంతటి నిర్మాణాల్ని చేపట్టే సత్తా ఉందా? లేకుంటే గ్రీకు చరిత్ర చెప్తున్నట్లు నిజంగానే సముద్ర దేవుడు పొసైడాన్ నిర్మించాడా? చాలా మంది మోడ్రన్ శాస్త్రవేత్తలు కూడా నమ్ముతున్న విషయమిది. దీనికీ, ప్రపంచంలోనే అత్యంత మిస్టీరియస్ ప్లేస్ అయిన బెర్ముడా ట్రయాంగిల్‌తో అట్లాంటిస్ నగరానికి దగ్గరి సంబంధాలున్నాయన్నది ఈ నమ్మకానికి హేతువు.
డేటింగ్ టెక్నిక్‌తో వీటి కాలాన్ని పరిశోధిస్తే కనీసం ఆరువేల సంవత్సరాల కాలం నాటికంటే ప్రాచీనతను కనుక్కోలేకపోయాయి. కానీ, ఓషనాలజిస్టులు మాత్రం ఇది పదివేల సంవత్సరాల క్రితం నాటి ప్లేటో చెప్పిన నగరమేనని చెప్తారు. అయితే దీని నిర్మాణంపై మాత్రం ఎక్కువ మంది గ్రహాంతరవాసుల సిద్ధాంతాన్నే విశ్వసిస్తున్నారు.
అట్లాంటిక్ మహా సముద్రంలో ప్రపంచానికి అంతుపట్టని అత్యంత విచిత్రమైన ప్రాంతం బెర్ముడా ట్రయాంగిల్‌కు పశ్చిమాన 500 వేల చదరపు మైళ్ల దూరంలో అట్లాంటిస్ ఆనవాళ్లు ఉన్నాయి. బెర్ముడా ట్రయాంగిల్ విశ్వంలోనే అత్యధిక అయస్కాంత శక్తి ఉన్న ప్రాంతం.. ఇక్కడికి వెళ్లిన ఏ వస్తువూ, జీవీ కూడా బతికి బట్టకట్టలేదు. ఈ డెవిల్ ట్రయాంగిల్‌కూ, అట్లాంటిస్ మహానగరానికీ ఏదైనా కనెక్షన్ ఉందా? ఏన్షియంట్ ఆస్ట్రోనాట్స్ మాత్రం ఉందనే చెప్తున్నారు.
అట్లాంటిస్ నగరం ప్రీహిస్టారిక్ సిటీ. బెర్ముడా ట్రయాంగిల్ జీవం పుట్టనప్పటిది.. బెర్ముడా ట్రయాంగిల్ గ్రహాంతర వాసులు తమ ఆవాసం కోసం భూమ్మీద ఏర్పాటు చేసుకున్న రిసార్ట్ లాంటిది… అందుకే మానవ నిర్మితాలైనవేవీ ఆ ప్రాంతంలో తిరిగే వాతావరణం లేదు. అట్లాంటిస్ కూడా అలాంటిదేనా? ప్లేటో వాదన నిజమే అయితే, గ్రీక్ మత గ్రంథాలు చెప్పినవీ నిజమే కావాలి. అదే నిజమైతే పొసైడాన్ దేవుడే ఈ నగరాన్ని నిర్మించి ఉండాలి.
ప్రాచీన గ్రీకు గ్రంథాల్లో వందల కొద్దీ దీవుల గురించిన ప్రస్తావన విస్తృతంగా కనిపిస్తుంది. అట్లాంటిస్ కూడా అలాంటిదే.. ఐస్ ఏజ్ పూర్తయ్యేంత వరకు అట్లాంటిస్ నగరాన్ని గ్రహాంతర వాసులు అపురూపంగా చూసుకున్నారు..ఐస్ ఏజ్ పూర్తయి సముద్రమట్టం పెరగటం ప్రారంభమైన తరువాత ఈ ఏలియన్స్ అంత నగరాన్ని ఒకే పగలు, ఒక రాత్రిలో సాగర గర్భంలో కలిపేసి వెళ్లిపోయారు.
ప్లేటో చెప్పిన ప్రకారం ఈ నగరాన్ని భారీ సముద్ర సునామీ ముంచెత్తింది.. అదే సమయంలో పెద్ద ఎత్తున అగ్ని కీలలు నగరాన్ని చుట్టుముట్టాయి. నీరూ, నిప్పూ కలిసి అంతటి మహానగరాన్ని అంతం చేశాయి. నీటి లోపల ఇవాళ దాని ఆనవాళ్లు ప్రీహిస్టారిక్ ఏజ్‌లోని విశ్వనాగరికతకు దర్పణం పడుతున్నాయి. ప్రపంచంలోని అయిదు మహా సముద్రాల్లో ఇంకా దాగి ఉన్న మన మూలాలు ఎన్నెన్నో.. అట్లాంటిస్ ఈ కోవలో ఓ మచ్చు తునక మాత్రమే.

Reviews

There are no reviews yet.

Be the first to review “జలలోకాలు.
కోవెల సంతోష్ కుమార్”

Your email address will not be published. Required fields are marked *