వచనపద్యాలు

గోపాల చక్రవర్తి
‘‘ఖడ్గమృగం శస్త్రనన్యానం చేస్తుంది అతిన నమీపాన
పుట్టంధుడు ద్యుమణిని చూస్తాడు ఆ కుటీర ప్రాంగణాన
ఎడారిలో పువ్వులు పూయించడం అతనికొక హేల
మహిషంచేత వేదం చెప్పించడం అతనికొక లీల
వేయి శుష్కనీతులకు సరి అతని మరణం
ధర్మప్రతిష్ఠాపన కోసం అతను చేసింది మహారణం

కుందుర్తి
మన కాలం అలాంటిది. అనుమానాలు మెండు
ఎవరూ ఎవణ్ణీ నమ్మరు. కంట్లో చల్లుతాడని భయపడి కొట్టువాడు
ఇంకో కులానికి కారం అమ్మడు.

దాశరథి
కాలం – కులాల కులాయాల కోనల్లో కూసే దొంగకోకిలల్ని పడుతుంది
కాలం – వర్గాల వర్ణాల పర్ణశాలల్లో పడుకునే
పచ్చి దొంగసన్యాసుల్ని పడుతుంది
కాలం కల్తీని పసికడుతుంది
విశ్వాస పాత్రమైన ప్రియురాలిలా వీపుతడుతుంది

మాదిరాజు రంగారావు
జీవితం యొక్క మొదలు చివర బిందువులను
ఈ లోకంలో కలుపు దివ్యరేఖ పరమేశ్వరుడు
ఆశ్చర్యానుభూతి వంటి వెలుగు లోతులు త్రవ్వుకొని
అలౌకికంగా సాగు జిజ్ఞాసా ఫలితం, వేదాంతం

కుందుర్తి
ప్రసవించి నశిస్తుంది గెలవేసిన అరటి తరువు
ప్రగతిశిశువు జననంతో అధర్మానికిక కరువు
పుడమి తల్లికిటీవలనే మరిచూలు నెలతప్పింది
గర్భచ్ఛేదనకెవరో విడిచిన వాడి ములుగు గురి తప్పింది

Reviews

There are no reviews yet.

Be the first to review “వచనపద్యాలు”

Your email address will not be published. Required fields are marked *