దేవుడి ఇల్లు
కోవెల సంతోష్ కుమార్

దేవుడి ఇల్లు
దేవలోకం తలుపులు
భూమిని పాలించే మహర్లోకం
మనిషి వెళ్లలేని దివ్యలోకం
దేవుడు నివసించే లోకం
స్వర్గసుఖాల్ని అందించేలోకం
దేవ లోకం …
జాడ తెలిసింది
దేవుడి ఇల్లు కనిపించింది
ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి
……………
మనిషికి దేవుడి ఇల్లు కనపడటం ఏమిటి? కాస్త కన్ఫ్యూషన్ గా ఉన్న మాట వాస్తవమే. కానీ, ఇది వాస్తవం. అది కూడా భూమ్మీదే లభించింది. దీన్ని తేలిగ్గా కొట్టి పారేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఎందుకంటే ప్రపంచం అంతా నమ్ముతున్న విశ్వాసం ఇది. ప్రస్తుతం ప్రపంచంలో అతి ప్రాచీన నాగరికతలు లభ్యమవుతున్న చోటే కనిపించిందీ దేవుడి ఇల్లు. పెరు.. దక్షిణ అమెరికాకు పశ్చిమంగా ఉన్న రిపబ్లిక్ దేశం. మనిషి నాగరికతకు అత్యంత ప్రాచీనమైన మూలాలు బయట పడిన ప్రదేశం.. ఆది మానవుడి అవశేషాలు దొరికిన ప్రదేశం.. ఇప్పుడు దేవుడి ఇల్లు జాడా చెప్తోన్న ప్రదేశం..ఇక్కడే దేవుడి ఇల్లును కనుగొన్నది.. మనుషులు లేని సమయంలో ఈ తలుపు తెరుచుకుంటుంది. దేవుడు భూమిపైకి వచ్చి మళ్లీ ఇక్కడి నుంచే తిరిగి తన లోకానికి వెళ్లిపోతాడు.. పెరులోని చాలా మంది స్థానికులకు ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చిన విషయమిది.
ప్రపంచంలో మరెక్కడా కనిపించని చాలా మూలాలు బయటపడింది పెరూ లోనే.. భూమ్మీద తొలి మానవ జంట ఆడమ్, ఈవ్‌లను మనిషి ఇక్కడే సృష్టించాడు.. ఈ అడవుల్లోనే వాళ్లు తిరిగారు.. ఆడుకున్నారు.. దేవుడి ఆజ్ఞను ధిక్కరించి ఆపిల్ పండు తిన్నారు. ఇవాల్టి ఈ సృష్టికి మూల కారణమయ్యారు.
ఈ ఆది మానవుణ్ణి సృష్టించడానికి దేవుడు భూమిపైకి వచ్చిన ్రప్రాంతమే దేవుడి నివాసం.. ఆయన తన నివాసం నుంచి బయలు దేరి ఆ తలుపు లోంచి భూమ్మీదకు వచ్చాడు ఈశ్వరుడు. దక్షిణ పెరులో 12,800 అడుగుల ఎత్తై ఆండెస్ పర్వత శ్రేతుల్లో విచిత్రమైన నిర్మాణం కనిపిస్తుంది. వేల సంవత్సరాల నుంచి భూమ్మీద ఉన్న మిస్టీరియస్ నిర్మాణం ఇది. ఈ కొండకు ఒక ద్వారం ఉంది. దానికి ఒక కీహోల్ కూడా ఉంది. ఇందులోంచే దేవుడు భూమ్మీద కాలు మోపాడన్నది ఒక విశ్వాసం. ఈ ద్వారం గుండా లోపలికి ప్రవేశించగలిగితే.. దేవుడి నివాసానికి వెళ్లే దారి కనిపిస్తుందిట. అది మామూలుగా ఉన్నప్పుడు రాయి లాగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆక్టివేట్ అవుతుంది. అప్పుడు మాత్రమే అది తెరుచుకుంటుంది. అది యాక్టివేట్ అయినప్పుడు అక్కడున్న ప్రతి వారికీ విచిత్రమైన ఎక్స్‌పీరియన్స్ కలుగుతుంది. ఇది ఒక సాండ్ స్టోన్.. అదీ చతురస్రాకారంలో ఉంది. సైంటిఫిక్ గా చూస్తే ఇది ఒక రాతి కట్టడం మాత్రమే దీన్ని దేవుడి తలుపుగా ఎలా భావించాలి? స్థానికుల విశ్వాసాన్ని ఎలా ప్రాతిపదికగా తీసుకోవాలి? కానీ, ఇదే నిజం.. ఇది స్థానికుల విశ్వాసం మాత్రమే కాదు.. అక్కడికి వెళ్లే ప్రతి పర్యాటకుడికీ ఎదురయ్యే అరుదైన అనుభవం. దేవుడి తలుపు ఒక నిజం. అది యాక్టివేట్ కావటమూ నిజం. అమర్ మరు డోర్‌వే వెనుక శక్తులు ఉన్నాయనే అక్కడికి వెళ్లిన ప్రజలంతా విశ్వసిస్తారు. దాని వెనుక సైన్స్‌కు అంతుపట్టని ఏవో తరంగాలు పని చేస్తున్నాయి. దాని దగ్గరకు వెళ్లిన వారికి విచిత్రమైన అనుభవం కలుగుతోంది. అక్కడ దైవ శక్తి ప్రబలంగా ప్రభావితం చేస్తుంది. అక్కడి గాలిలో, ధూళిలో, నేలలో, ఆకాశంలో అంతటా దైవమే కనిపిస్తుంది. ఆ తలుపు వెనుకే మహర్లోకపు మార్గముండటం వల్లనే ఇదంతా జరుగుతుందని అందరి నమ్మకం. దక్షిణ పెరులో టిటికాకా సరస్సు ప్రాంతంలో అమర్ మరు డోర్‌వే ఉంది. ఇది సాండ్ స్టోన్‌తో ఉన్న నిర్మాణం. ఇది మానవ నిర్మితమనటానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆకాశం నుంచి దిగి వచ్చిన వారికి సంబంధించిన నిర్మాణమే ఇదని అంతా నమ్ముతారు. ఈ నమ్మకం తప్ప దీనికీ ఆధారంలేదు.. సైంటిఫిక్‌గా ఏ విధంగానూ రుజువు కాని మిస్టరీ ఇది. సాండ్ స్టోన్ మౌంటెన్ ఒక పద్ధతి ప్రకారం ఎలా ఏర్పడిందన్నది ఇంతవరకూ తేలలేదు. చతురస్రాకారంగా ఒక పర్వతం తనంత తానుగా ఏర్పడటం ఎలా సాధ్యం? దీనిపై రకరకాల పరిశోధనలు చేశారు.. కాల నిర్ణయం కోసం కార్బన్ డేటింగ్ చేశారు. కానీ, ఏదీ స్పష్టం కాలేదు. ఏదీ అర్థం కాలేదు. కానీ, దీని దగ్గర ఎలక్ట్రో మాగ్నెటిక్ పవర్ లాంటిది ఏదో ఇక్కడ దాగి ఉంది. ఇదేదో ఆషామాషీగా చెప్పుతున్న సంగతేం కాదు.. మీరూ చూడవచ్చు. టిటికాకా సరస్సుకు షికారుకు వచ్చిన జెర్రీ అనే వ్యక్తి డోర్‌వే గురించి తెలుసుకోవాలనుకున్నాడు.. ఎర్రని షాల్ చుట్టూ కప్పుకుని డోర్‌నేలోకి ఎంటర్ అయిపోయాడు.. కొద్ది సేపటికే ఎలక్ట్రో తరంగాలు అతణ్ణి చుట్టుముట్టాయి. అంతా చూస్తుండగానే ఒక్కసారిగా అతను మాయమైపోయాడు. డోర్‌వే ముందు నిలుచున్న జెర్రీకి ఉన్నట్టుండి ముందుకు పడిపోతున్న ఫీల్ కలిగింది. ఏం జరుగుతోందో అర్థం కాలేదు.. ముందు ఒక గొప్ప వెలుగు తో ఉన్న దారి కనిపించింది. అంతా చూస్తూనే ఉన్నారు.. కళ్ల ముందే జెర్రీ ఒక్కసారిగా మాయమైపోయాడు.. ఏం జరిగిందో అర్థం అయ్యే లోగానే…మళ్లీ ఎలా మాయమయ్యాడో.. అలాగే ప్రత్యక్షమైపోయాడు.. ఇదంతా జరిగేసరికి ఒకటిన్నర నిమిషం వ్యవధిలోనే జరిగిపోయింది. ఇదెట్లా సంభవించిందంటే ఎవరికీ తెలియదు..సైన్స్ కూడా ఇప్పటికీ డిఫైన్ చేయలేకపోయింది. పురావస్తు శాఖ అర్థం చేసుకోలేకపోయింది. గ్రహాంతర వాసులు భూమ్మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్రదేశాల్లో ఇదీ ఒకటనే వాదనా వినిపిస్తుంది. ఇక్కడే మరో విచిత్రం ఉంది. ఈ దేవుడి తలుపుకు ఒక కీహోల్ వంటి రంధ్రం కూడా ఉంది. దీన్ని ద్వారానే గేట్ తెరుచుకుంటుందని, ఇందులోంచే దైవ శక్తి తరంగాలు వెలుపలికి వస్తాయని అంటారు. పెరులో ప్రాచీన మానవ నాగరికతకు సంబంధించిన చాలా చాలా ఆనవాళ్లు బయటపడ్డాయి. కానీ, దేనికీ లేని ప్రాధాన్యం డోర్‌వే ఆఫ్ అమరు మెరుకు ఉంది. భూమ్మీద మరెక్కడా కనిపించని మిస్టీరియల్ పవర్ ఇక్కడ స్పష్టంగా ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వస్తుంది. అన్నింటికీ మించి ఈ డోర్‌కు ఉన్న కీహోల్ రహస్యం ఏమిటి? టిటికాకా సరస్సు పక్కనే నివసించే స్థానికులు రోజూ ఉదయాన్నే దేవుడి గుడికి సంప్రదాయ బద్ధంగా పూజలు చేస్తారు.. వీళ్లంతా పేద రైతులు.. ఈ దేవుడి తలుపుకు ఎదురుగా ఉన్న పొలాల్లో వ్యవసాయమే వీళ్లకు ఆధారం. ఇక్కడ మాత్రమే వీళ్లు వ్యవసాయం చేస్తారు. ఈ ప్రాంతాన్ని వదిలి ఇంకెక్కడికీ వెళ్లరు.తరాల కొద్దీ కొనసాగుతున్న సంప్రదాయమే ఇది. రాత్రి పూట మాత్రం ఏ ఒక్కరూ కూడా ఈ దేవుడి తలుపు దరిదాపుల్లోకి కూడా రారు. దీనికి ఎదురుగా ఆడుకోవటానికి వెళ్లిన పిల్లలు మాయమైపోయారని, చెప్తారు. కొన్ని సందర్భాల్లో టిటికాకా సరస్సు దగ్గరకు వెళ్లి చీకట్లో కలిసిపోతారు. మళ్లీ వెనక్కి తిరిగి వచ్చిన సందర్భాలు లేవు.
పెరులో దొరికిన శాసనాల ప్రకారం తొలి మత గురువుల్లో ఒకరైన అమరు మురు.. ఈ గేట్‌వేను తెరిచేందుకు ప్రత్యేక పరికరాన్ని తయారు చేశాడు. ఇది ఒక గోల్డెన్ డిస్క్ ఆకారంలో ఉంటుంది. ఈ గేట్‌వేను ఈ గోల్డెన్ డిస్క్ సహాయంతోనే యాక్టివేట్ చేసేవారు. ఇది ఒకసారి యాక్టివేట్ అయితే.. దీని లోపలికి వెళ్లి రావటానికి దారి ఏర్పడుతుంది.
గోల్డెన్ డిస్క్ ఆకాశంలోంచి వచ్చిందని కూడా మరో కథనం ప్రచారంలో ఉంది. ఆర్కియాలజిస్టులు ఎగ్జామిన్ చేసినప్పుడు డోర్‌వేలో సర్క్యులర్ డిస్క్ ఆకారం కనిపించింది. ఇదంతా చూస్తే , వింటే రబ్బిష్ అని అనిపిస్తుంది. కానీ, దీని వెనుక ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్ పవర్స్ బయటపడ్డాయి. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలే ఒప్పుకుంటున్నారు.. మామూలు మనుషులకే దీని పవర్ ఏమిటన్నది అనుభవంలోకి వచ్చింది. ఇతర గ్రహాల నుంచి వచ్చిన ఇద్దరు స్పేస్ బ్రదర్స, దీన్ని యాక్టివేట్ చేసినట్లు చెప్పుకుంటారు.
గేట్ ఆఫ్ గాడ్ ఒక్కసారి యాక్టివేట్ అవుతే.. విశ్వంలో ఒక చివరి నుంచి మరో చివరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటారు. గ్రహాంతర వాసులు యుఎఫ్‌ఓల్లో లేక్ టిటికాకా సమీపంలో దిగినట్లుగా చెప్తారు. ఇప్పుడు ఈ ఏక్స్‌ట్రా టెర్రెస్ట్రియల్ పవర్స్ గురించి సైంటిస్టులు పాజిటివ్‌గా ప్రయోగాలు చేస్తున్నారు.. గ్రహాంతర వాసులు ఉన్నారనటానికి ఇదీ ఒక ఉదాహరణ అని వాళ్లు ఒక కంక్లూజన్‌కు ఇప్పటికే వచ్చేశారు. ఈ గ్రహాంతర వాసులే దేవుళ్లయితే.. ఒకవేళ వాళ్లు నిర్మించుకున్న డోర్‌వేనే ఇదయితే, దీన్నుంచే గ్రహాంతర వాసులు భూమ్మీదకు వచ్చి వెళ్తున్నారన్నదీ వాస్తవమేనా?
ఇది దేవుడి డోర్‌వే కావటానికి కారణం బెర్ముడా ట్రయాంగిల్‌లో ఉన్న మాగ్నటిక్ పవర్ ఇక్కడ కూడా కనిపించటమే. సైంటిఫిక్‌గా ప్రూవ్ అయిన విషయమే ఇది. దీని దగ్గరకు వెళ్లగానే ఇందులోని కీహోల్‌ను తగలగానే మాగ్నెటిక్ పవర్ మనిషిని తనలోకి లాక్కొనేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పవర్ సామర్థ్యం కానీ, దీని వెనుక ఉన్న సీక్రెట్‌ను కనుక్కోవటం ఇప్పటికైతే ఎవరి తరం కాలేదు. ప్రపంచంలో మిస్టీరియస్‌గా మిగిలిపోయిన ప్రాంతాల్లో ఇదీ ఒకటి. దీని ఆనుపానులేమిటన్నది దేవుడికి మాత్రమే తెలుసు… అందుకే ఇది దేవుడి తలుపు అయింది.. ఇది తెరుచుకుంటే ఆ లోపల ఉన్నది దేవుడి ఇల్లు.. ఇది నిజం..

Reviews

There are no reviews yet.

Be the first to review “దేవుడి ఇల్లు
కోవెల సంతోష్ కుమార్”

Your email address will not be published. Required fields are marked *