కవిత్వం మారిపోయిందా? పారిపోయిందా?
సుప్రసన్నాచార్య.

కవిత్వం ఈనాడు మారిపోయిందని కొందరూ, పారిపోయిందని కొందరూ వాదించుకుంటున్నారు. కవిత్వమనేది ఒక మౌలికమైన పదార్థమై నీరులాగా, గాలిలాగా, ఎపుడూ ప్రసరించేది అయితే ఒక పార్శ్వం, వసంతంలా ఋతువు ఋతువునకొక రూపుదాల్చి పరిక్రమించే కాలమే ఐతే అదొక పార్శ్వం. ఎపుడూ వర్షాలవల్ల, ఉపనదుల వల్ల కొత్త నీరు చేరుతూ పాతనీరు కడలిలోకి పోతూ ఎపుడూ ఒకే నదిగా కనిపించే ప్రవాహం అయితే ఒక పార్శ్వం. ఇవన్నీ కాదని దివారాత్రులు కలినిన దినంలాగా శిశిర వసంతాలు సంగమించిన ఋతువుల్లా మారుతూ మారకుండా, మారకుండా మారుతూ ఆవిష్కృతమయ్యే అనుభవం ఒక పార్శ్వం. ఇలా కవిత్వం అనే ఒక పర్వతాన్ని వివిధ స్థలాలనుండి చూచినపుడు మనకు కలిగే అనుభవంలో వైరుధ్యం, వైవిధ్యం, వైతథ్యం, వైశాల్యం అన్నీ ఒక్కొక్క భూమికనుండి సత్యాలే.
కవిత్వమంతా శబ్దవికాసం. శబ్దం తన పరిమితులను విస్తరిస్తూ విస్తరిస్తూ వ్యక్తావ్యక్త జగత్తును సంపూర్ణంగా ఆవరించినపుడు అపుడది కవిత్వమౌతుంది. వినబడి వినబడని శబ్దం, వినబడని అనుభవ తరంగాలను క్రమంగా ప్రసరింపజేస్తుంది. ఒక్కో తరంగం మృదువుగా సహృదయుని చేతస్సును స్పృశిస్తుంది. ఋగ్వేదంలో శబ్దం తన భావలోకాన్ని వికనించి సంపూర్ణంగా ఆవిష్కరించుకునే సన్నివేశాన్ని ఇలా వర్ణించింది.
‘‘చూచినా చూచినట్లు కాదు
విన్నా విన్నట్లు కాదు
ఐనా ఎవరికో కాని
పతి ముందర సుందరి అంబరాల్ని త్యజించినట్లు,
ఆంతర్యాన్ని విప్పి చెప్పుతుంది వాక్కు’’ (ఋగ్వేదము 10.71.4.)
ఈ వాక్కు రహస్యాన్ని విప్పి చెప్పేందుకు కావ్య పాఠకునికి విశ్వాన్నంతా తనలో ఇముడ్చుకోగల చైతన్యం ఉండాలి. చరాచర ప్రకృతి సంవేదనలను తనలో ప్రతిఫలింప జేసుకోగలగాలి. కవిత్వం అనే ఖడ్గానికి శబ్దం ఒర మాత్రమే. ఒరలోంచి వెలువడ్డ ఖడ్గం మాత్రమే ఆయుధం అవుతుంది. కావ్యశబ్దం కవి ప్రయోగించిన శబ్దద్వార కవాటాలను తెరుచుకోగలిగినపుడు అనుభవరూపం తాలుస్తున్నది.
‘‘ఒక చెప్పు తెగి ఎక్కడో పడిపోతే
రెండో చెప్పు పనికిరాదు
దీనినీ తప్పకుండా పారేయాల్సిందే’’ (ఎటు? రామా చంద్రమౌళి)
జీవితం కదలడానికి కావలనిన ప్రధానమైన ఉపకరణం సమాజం ెుుక్క ప్రాథమికమైన యూనిట్ దాంపత్యం. అందువల్ల మొత్తం జీవితం ఈ దంపతుల ఆధారంగా సంచరిస్తుంది. ఈ తత్త్వాన్ని చెప్పడం కోసం దంపతులను పాదరక్షకులుగా రూపించడం! వీరిలో ఎవరు లేకపోయినా జీవితం అసంపూర్ణం, అసమగ్రం, అసంతుష్టం. ఈ న్థితిని వ్యంజింపచేయడానికి కవి రెండో చెప్పు పనికిరాదని చెప్తున్నాడు. జీవితంలోని విధురత ఎంత భయానకమో ఒక సంపూర్ణవ్యక్తిని ఎంతగా అసంపూర్ణంగా శూన్యంగా మార్చివేస్తుందో ఈ రూపకం వ్యాఖ్యానిస్తూ ఉన్నది. ‘దీన్ని తప్పకుండా పారేయవలనిందే’ అనడంలో న్ర్తీ పురుషలలో ఏ ఒకరి జీవితమైనా ఎంత వ్యర్థమైపోతున్నదో చెప్తున్నాడు. కావ్యం వాచ్యార్థాన్ని దాటి పరంపరగా అనేకానేక అర్థాలను వ్యక్తీకరించగలగడం. ఈ అర్థపరంపర అనంతంగా తరంగాలు తరంగాలుగా సాగిపోవడం ఈ వాక్యాలను సూచిస్తు న్నాయి. ధ్వని నిద్ధాంతం అంతా దీన్నే చెప్తుంది.
‘‘పండు వెన్నెల
చీకటంతా చేరింది
చెలికళ్ళల్లో’’ (ఋతుభ్రమణం పృథ్వీరాజు.టి.)
వెన్నెల రావడంతో చీకటి పారిపోయింది. ఆ చీకటి చెలికళ్ళల్లోకి చేరిపోయింది. చెలికళ్ళల్లోనుంచి ప్రసరించే ఆ నీలకాంతులు ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తున్నవి. చుట్టూ వెన్నెలలు ఆవరించి ఉన్నవి. వ్యక్తి ఒకవైపు చీకటినీ, మరోవైపు వెన్నెలనూ, రెండూ రెండు సౌందర్య సముద్రాలుగా అంతస్సులో బయటా మునకలు వేస్తున్నాడు. ఆలంబన ఉద్దీపన విభావాలకు విభాజన రేఖ తొలగిపోతున్నది. చెలి చిరునవ్వు వెన్నెలయింది. వెన్నెలవల్ల పారిపోయిన చీకటి అనంత అంబరపు నీలి నీడలను వ్యక్తం చేస్తూ ప్రణయము ెుుక్క ఆనంత్యాన్ని స్థాపిస్తున్నది.
మరో కవి తన బిడ్డ తప్పిపోయినపుడు తల్లి పడే బాధను ఇట్లా వ్యక్తీకరిస్తున్నాడు
‘‘తన రక్తమే మరెక్కడో గుక్క పట్టినట్లు
తన ఊపిరే మరెక్కడో తలకిందులవుతున్నట్లు
ఆమెలో ఎన్ని తుపానులో
విడిపోయిన తన హృదయ శకలానికై
అదృశ్యమైన తన వాస్తవ స్వప్నానికై
ఆదుర్దాగా … ఆందోళనగా …
జన సమ్మర్దంలో రొదలో …’’ (ప్రవాహందర్భశయనం)
మనిషి జీవితంలో అత్యంత ఆత్మీయమైన పార్శ్వం ఉంది. తల్లీబిడ్డల అనుబంధం అదృశ్యమైన తన ‘వాస్తవస్వప్నం’ అన్నపుడు బిడ్డకోసం తను కన్న కలలు వాస్తవంగా రూపుదిద్దుకోవడం అన్న సాఫల్య లక్షణం స్ఫురిస్తుంది. బిడ్డను గూర్చి ఆపత్ శంక బలమయి జీవితాన్ని తలకిందులు చేస్తున్నది. తన ఊపిరే మరెక్కడో తలకిందులవుతున్నట్లు అన్నపుడు ఇద్దరిమధ్య ఉండే అభిన్నభావము వ్యక్తమవుతున్నది. సంతానం ద్వారా కవి పొందదలచిన పునరుత్థానం అనుభవంలోకి వస్తుంది. అందుకే ఈ కవి ‘నా జీవన మైదానంలో దూరం పేరు పోెుమ్’ అంటాడు.
మరొకచోట కవిత్వంలో బొమ్మలు సవ్వడి చేస్తాయి. అవ్యక్తం రూపుదాలుస్తుంది. ప్రాణం రెక్కలు కట్టుకొని ఆకాశంలో పరిక్రమిస్తుంది.
‘‘నేను మాత్రం
సవ్వడి చేేన ఇంద్రధనుస్సునై
కొమ్మ కొమ్మకు గోపురం కొమ్ముకు
తిరుగుతుంటాను’’ (సుపర్ణఇంద్రగంటి శ్రీకాంతశర్మ)
ఇంద్రధనుస్సు బహువర్ణ వైచిత్రితో జగత్తులోని అనేకత్వాన్ని సమన్వయాన్ని సూచిస్తుంది. ఆ ధనుస్సు చేేన సవ్వడి మానవచైతన్యంలోని ఏకత్వాన్నీ, అనేకత్వాన్నీ ఏకకాలంలో స్ఫురింపజేస్తుంది. అందువల్ల తాను అంటే జగచ్చైతన్యం, సృజనాత్మకమైన సత్య ప్రవృత్తిశీలమైన కొమ్మకొమ్మకూ, దైవభావ స్పందన ప్రతీకయైన గోపుర శిఖరానికీ, నడుమ పరిభ్రమిస్తూ ఉంటుంది. అంటే కాలము, అనంతము ఈ రెంటికీ నడుమ కవి ఒక ేనతువు కడుతూ ఉన్నాడన్నమాట.
జగత్ పరిణామంలో కాబోయే దివ్యచైతన్యస్పర్శ ఎలాంటి కొత్త లోకాలను సృష్టిస్తుందో కవి భావిస్తున్నాడు. అపుడు సంకోచాలు లేవు. చీకట్లు లేవు. ప్రలోభాలు లేవు. కామక్రోధాలు లేవు. ఈ లోకానికి దివ్యలోకానికి నడుమ వర్తమానానికి భవిష్యత్తుకు నడుమ తెరలు తొలగిపోయాయి. దీన్ని వర్ణిస్తూ కవి ఇలా చిత్రిస్తున్నాడు.
‘‘భవిష్యత్తు మంచుముసుగు వదిలింది
జీవితం మృత్యురహస్యం వీడింది
మనస్సు నృత్యం చేస్తోంది వెలుగై
ఊహ కదలుతోంది అగురు ధూపమై
ఎక్కడా ఏ ఒక్క బిందువులోనూ చీకటి లేదు
దివ్యరాగస్పర్శతో జీవితం మహితమైనట్లుంది’’
(ేన్వచ్ఛాకవిత్వం మాదిరాజు రంగారావు)
బిందువులో చీకటి లేదన్నప్పుడు బిందువు ఆత్మకు ప్రతీక అవుతున్నది. ఊహలో పరిమళాన్ని చూడటం వాస్తవం. ఊహ ఉజ్వల వాస్తవంగా పరిణమించటాన్ని సూచిస్తున్నది. భవిష్యత్తు మంచుముసుగు వదలడం అన్నపుడు, ఇంతకాలం అభివ్యక్తం కాని నూతన లోకం ఆవిష్కృతమౌతుందన్న, అవబోతుందన్న తాత్పర్యం తెలియపరుస్తుంది. మనస్సు వెలుగై నృత్యం చేయడం అన్నప్పుడు రెండు అమూర్త పదార్థాలను రూపకీక రించడంగా తెలియవస్తుంది.
పూర్వం ఎవరో అజ్ఞాతకవి చెప్పిన పద్యం ఇది
‘‘అతడు సముద్రజలాన్ని దాటాడు
జనకరాజు బిడ్డ శోకాగ్నిని
సంపాదించి దానితోనే లంకను దహనం చేశాడు’’1
ఇక్కడ ప్రనిద్ధమైన లంకాదహన వృత్తాంతాన్ని రెండు విరోధాంశాల నడుమ నిబంధిస్తున్నాడు కవి. సముద్రజలాన్ని దాటడం ఒకటి ఇది భౌతికాంశం. నీతాదేవి శోకాగ్నిని సంపాదించడం అనేది అమూర్తసాధన. ఈ అమూర్త సాధనం లంకా దహనానికి హేతువుగా చెప్పడం ద్వారా ఒక న్ర్తీ దుఃఖం జగత్తును ఎంత క్షభపెట్టగలదో ఎన్ని యుగాలను తల్లడింపజేయగలదో, ఎందరు భావుకులను వశీకరించగలదో వ్యక్తమౌతుంది.
జీవితంెుుక్క వ్యర్థమైన సన్నివేశాలను వర్ణిస్తూ నిత్యమూ మృత్యుముఖంగా ప్రయాణిస్తున్న తాను లౌకికమైన వాసనలకు దూరదూరంగా తొలగిపోలేని లక్షణాన్ని స్ఫురింపజేస్తాడు కవి ఈ క్రింది పాదాల్లో
‘‘కోరి కబేలాకు మందగా లాగుకొని పోవుచుండ
దారి ప్రక్కనయున్న పచ్చి గడ్డిపై తారాడు పసుల
తీరుగా నున్నది జనుల భోగాశ …’’ (విశ్వనాథ మధ్యాక్కఱలు)
కబేలా, గడ్డి, పశువు ఇక్కడ మృత్యుగ్రస్తమైన అనిత్యభోగమయమైన జీవుల దైన్యన్థితిని వ్యక్తం చేస్తున్నది. మృత్యువును కబేలాగా చెప్పడంవల్ల అది ఎంతగా అపరిహార్య మైందో లౌకిక జీవనానికి లక్ష్యమైందో జీవితాన్ని క్రూరంగా హననం చేయగలదో స్పష్టీకరిస్తుంది.
ఇలా చూస్తూ పోతే కవిత్వానికి ఏ కాలంలోనైనా భావుకనీమల్లో అనంతంగా విస్తరిస్తూ పోవడమే ప్రధాన లక్షణంగా ఉన్నట్లు కనిపిస్తుంది. మనం ఎన్ని చర్చలు చేసుకున్నా కానీ, అది వస్తుమాత్రం కాదు. అలంకార సంయోజితమే కానీ అలంకారం మాత్రం కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే అది ఏదీ కాదు, అన్నీ అవును అనిపిస్తుంది. ‘నా కన్నవి విన్నవి విన్నవింపగా మాటలకై వెదుకాడగబోతే’ అని నిఘంటువులను, ఛందస్సులను, వ్యాకరణాంశాలను దాటిపోవడం గమనించితే అతడు వీటన్నిటికీ అతీతమైన ‘క్షణికమై శాశ్వతమైన’ ఏదో ఒక మూర్తామూర్త పదార్థాన్ని అందుకోబోతున్నట్లుగా తెలియవస్తుంది. అంతకుపూర్వమే మరొకకవి ఈ అన్వేషణను గుర్తించే ప్రయత్నం చేస్తూ
‘‘నా కవితన్ విశాలజఘనా, ఒక ఔచితి లేదు, భాషలే
దాకృతి లేద, ఊరక రసాకృతి నే ప్రవహించిపోదు, నీ
వాకృతి అందమాచిన రసాత్మవు, నీకును నాకభిన్నతా
శ్రీకతకల్గెనా పులకరించెను పొమ్ము రసప్రపంచముల్’’ (స్నానసుందరివిశ్వనాథ)
ఈ రసము అనాదియైంది. విశ్వచైతన్యంలోని జీవుని ప్రతిఫలనం అది. ఇన్ని యుగాలుగా శబ్దం దాన్ని అందుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నది. ఈ రెంటికీ అభిన్నత అదె్వైతం నిద్ధించడం కవిత్వం ఎక్కగలిగిన శిఖరం.
వర్తమానం ఎపుడూ సంకుచితమే. ఒక వస్తువునో అభివ్యక్తినో భావజాలాన్నో ఆశ్రయించి ఉంటుంది. ఆ కాలం గడిచేప్పటికే ఇవిమారిపోతూ ఉంటాయి. జారిపోతూ ఉంటాయి. మూలపదార్థం అలాగే నిలిచి ఉంటుంది. అంటే మారేది పైపై పరివేషము, మారనిది అంతశై్చతన్యము. ఉపనిషత్తు చెప్పినట్లుగా ‘తదేజతి తన్నైజతి’ అది కదులుతుందీ, కదలదూ. అంటే మారుతుందీ, మారదు.
మానవ జగత్తులో అనుభవం లోతులు శబ్దం ద్వారా ఆవిష్కరింపబడినంతకాలం కవిత్వం ఎక్కడికీ పారిపోదు.

Reviews

There are no reviews yet.

Be the first to review “కవిత్వం మారిపోయిందా? పారిపోయిందా?
సుప్రసన్నాచార్య.”

Your email address will not be published. Required fields are marked *