కవిత్వం నిరంతర పరిణామ చక్ర భ్రమణం
సుప్రసన్నాచార్య.

చైనా భారతదేశంపైన దండయాత్ర చేనిన సందర్భంలో ఒక ప్రనిద్ధ తెలుగు కవి ‘మనం పద్యాలు రాేన్త చైనావాళ్లు యుద్ధం మానేస్తారా’ అని ప్రశ్నించారు.క ఈ ప్రశ్న వెనుకాల కొన్ని అంశాలు మన ఆలోచనకు గురిచేస్తాయి. 1. కవిత్వం తాత్కాలి కంగా సమస్యలకు పరిష్కారాలను తేగలదా? 2. కవిత్వం భౌతిక జీవనస్థాయిలో పరిణా మానికి, పరిష్కారానికి దోహదం చేయగలదా? 3. కవిత్వం ఏ స్థాయి పాఠకులలో ఏ స్థాయి సంస్కారానికి దోహదం చేస్తుంది? ఈ మూడు ప్రశ్నలూ ఒక ప్రశ్నలో అంతర్భాగాలే కావటానికి వీలున్నది.
ప్రాచీన కాలంలో కావ్యం పురుషార్థ ప్రతిపాదకంగా పేర్కొనబడ్డది. ఇంకా ‘శివేతర క్షతి’ అని కూడా చెప్పబడ్డది. కాళిదాసు ‘రమ్యములైన దృశ్యాలను చూచినా మధురములైన శబ్దాలను విన్నా, మనస్సు తెలియని ఒక ఆవేదన పొందుతుంది. మనస్సులో అర్థంకాని పూర్వపూర్వజన్మల అనుభవాలను చిత్తం స్మరించుతుంది’ అన్నాడు. తెలియబడని ఆవేదనను పొందటం, పూర్వపూర్వజన్మల అనుభవాలను స్మరించటం ఈ రెండంశాలు భౌతికస్తరం మీద ఏ ప్రయోజనాలను ఉద్దేశించటం లేదు. మనిషి మనోలోకంలో విస్మృత తమోలోకాలను బహిర్గతపరచటమే సబ్‌కాన్షన్, అన్‌కాన్షన్, కలెక్టివ్ అన్‌కాన్షన్ ప్రపంచాలను వెలికి తీయటంగా చెప్పుతున్నది.
‘‘అన్నీ ఛిన్నాభిన్నాల మధ్య
స్వప్నశిథిలాల మధ్య, తెగిపడ్డ తలల మధ్య
పగిలిపోయిన మాటలమధ్య మంటల మనుషల మధ్య
విరిగిపోయిన తలుపుల మధ్య, తలెత్తుకోలేని అవమానాల మధ్య
బండ బరువుల మధ్య నీళ్లెండిపోయి
ఒడ్డుల బుగిలిపోతున్న పడవల మధ్య
రాత్రి నుంచి రాత్రికి ప్రయాణాల మధ్య
దహన సంస్కారాలు లేక కుళ్లిపోతున్న శవాల మధ్య
రెండుగా చీలుతున్న వేళ్ల మధ్య, వేకువనే
కావిడేసుకుని నీళ్లు మోస్తూ, ఎదురుదెబ్బ తగిలి
నెత్తురోడుతున్న కాలిబొటనవేలి మధ్య
పద్యం మొదలుపెట్టరా! దరిద్రుడా!
పద్యాన్ని గారాబం చేయకురా
చెడిపోతుంది, చేతగానిదౌతుంది’’ (శివారెడ్డి అంతర్జనం)
ముమ్మటుడు చెప్పాడు, కవిత్వానికి ఏ నియమమూ వర్తించదని. ‘నియతికృత నియమరహిత’ అని. శివారెడ్డి అంటున్నాడు పద్యాన్ని గారాబం చేెుుద్దని. కవిత్వం విశ్వవ్యాప్తమైన అనుభవ సముద్రం. తల్లిదండ్రుల్లేని రైల్లోంచి రైల్లోకి ప్రయాణం చేేన అనాధ శిశువు పద్యం. కవిత్వానికి వస్తువు రూపం తల్లిదండ్రులనుకొంటున్నారేమో. వాళ్లిద్దరూ నియతంగా ఎప్పుడూ ఉండరు. ‘పుష్పం పుష్పంలానే, మాట మాటలానే, నేత్రం నేత్రంలానే తాను తనలాగానే ఉంటారు. కాదు ఏదీ దానిలా ఉండదు’. ఇదీ కవిత్వ రహస్యం. కవిత్వంలో అనుభవము (పుష్పం), భాష (మాట), దర్శనం (నేత్రం), కవి (నేను) సంపూర్ణంగా పరివర్తన చెందుతాయి. ఏదీ దానిలా ఉండదు. ఈ పరిణామం పొందకపోతే వాచ్యస్థాయిని దాటకపోతే అప్పుడే నేత్రాంధకారం, పుష్పాంధకారం, పదాంధకారం.
అయితే, కవి కవిత్వంలోకి ప్రవేశించగానే అయితే భ్రష్టయోగి లేదా అఖండ యుద్ధయోగి. భ్రష్టయోగి అంతర్జగత్తులోనుంచి శబ్దాన్ని ఎన్నుకుని పద్యమై బయటకు ప్రవహించినవాడు. అంతర్జగత్తులో వైశ్వానరుడై జగదనుభవ కల్లోలాల తాకిడితో కొట్టుకుపోతూనే, పైకి తేలివచ్చే అఖండ యుద్ధయోగి.
‘‘గగనమును చుంబించ దలచిన అలలకూ లేదాెు నిద్దుర
జాబిలిని బంధించదలచిన వలలకూ లేదాెు నిద్దుర
చంద్రికను తాగేని తడబడు రాత్రికీ లేదాెు నిద్దుర
నన్ను రేపటి రేవు చేర్చెడు మధువుకూ లేదాెు నిద్దుర’’
(పెన్నా శివరామకృష్ణ సల్లాపం)
తొలి రెండు వాక్యాలలో ప్రపంచంలో నూతనావిష్కారాలకోసం, సాఫల్యాలకోసం, విశిష్టన్థితికోసం చేేన నిరంతర నిర్ణిద్ర ప్రయత్నాలు స్ఫురిస్తున్నాయి. మూడవ పాదంలో రాత్రి తొందరపడి, కనిపింపజేేన వెన్నెలనే తాగేనింది. అందువల్ల తడబడుతున్నది. జగద్యాత్రలో అప్పుడప్పుడూ సంభవించే దుష్ట సన్నివేశాలను తిరోగమన సన్నివేశాలను ఇది స్ఫురింపజేస్తున్నది. మహాత్మాగాంధీ హత్య తరువాత దేశం పొందిన సంక్షభన్థితి ఈ ‘రాత్రి’ది. నాల్గవపాదంలో మధువు ఒక అసాధారణ ఉపకరణం తన చైతన్యాన్ని సంపూర్ణంగా పరివర్తన చేేనది. భవిష్యత్తును సాక్షాత్కరింపజేేనది. కవిత్వమో లేక దానికి పర్యాయమైన దివ్యత్వారోహణమో.
కవి వైశ్వానరుడై (విశ్వమానవుడై) పొందుతున్న వేదన ఇది. ఈ వేదనెుుక్క విశ్వరూపం వెలికి తేవటానికి శబ్దముఖం ధరిస్తాడు కవి. ఈ శబ్దం అనేక విధాల రూపాలెత్తుతుంది కవివల్ల. ‘నీ సాంఘీకరించే శాం మీదొట్టు’. తన టీచర్ చెప్పే సాంఘికశాస్త్రాన్ని గూర్చి చెప్పుతున్నాడు కవి. ఈ శాం ఘీకరించింది ‘మదగజంలా’. విద్యార్థి బెదరిపోయాడు. ఇక్కడ సాంఘికశాం, ఘీంకారం రెడూ కలనిపోయాయి. ‘మేఘాలు ఏడుస్తాయి కాటుకకళ్లతో కుచ్చిళ్లు సరిగా పోసుకోకుండా నీరు ప్రవహిస్తుంది ముడతలు ముడతలుగా నీరు ముడుతలైంది చీర కుచ్చిళ్లు సరిగా పోసులేదు’. ఇది మరొక శబ్దం తాల్చిన నదీవనితాద్విరూపం.
‘‘ఒకే మనిషి
పిలిచిన పిలుపుల
అరచిన అరుపుల పెట్టిన ఘోషల
వెనుక
వెనుదిరిగి కూడిన మనిషి
కన్నీరై రాలిన మనిషి
ఎప్పుడూ ఒంటరై
కంటతడిపెట్టి కనిపించే
విలపించి
క్షమతో కదలిపోయే
ఒకే ఒక్క మనిషి’’. (నీతారాం ఐ/ళి మాణిక్యం)
ఈ ‘ఒకేఒక్క మనిషి’ కవి వస్తువు. జగత్తంతా తనలో లీనం చేసుకున్నవాడు. ‘పర్యుత్సుకో భవతి యత్సుఖితోపి జంతుః’ అన్న మాటకు గాఢమైన వ్యాఖ్య. ఈ అంశమేదీ దేశకాలాల పరిమితులకు లొంగివుండేది కాదు.
నాగరీకరణం వల్ల గ్రామాలు శిథిలాలై వ్యవసాయం మందగించటం, ప్రాధాన్యం కోల్పోవటం వర్తమానం తెచ్చిన విషాదం.
‘‘కట్టై, పిడకై
పంటై, పండై
మందై, మాకై
పండుగలకు తోరణమై
దేవుని నిగలో పువె్వై, పత్తిరై
నీడిచ్చి నీళ్లిచ్చి పాలిచ్చిన నేల
నల్ల నిద్రలో ఆకుపచ్చ కలలైన నేల
నిద్ర వొలుచుకున్న బతుకు నిండా
వెలుగు బ్రతుకైన నేల
మట్టివాసన నిచ్చిన నేల
బతుకుతనాన్నిచ్చిన నేల
చూపుల్నే అందగించిన నేల
ఇప్పుడు
అందరి చూపులకూ అడ్డమైంది
పట్నం ముంచుకొస్తున్నది’’. (నింగిడి రామగిరి శివకుమారశర్మ)
నేలకూ మానవుడికీ ఉన్న అవిరామ సంబంధాన్ని స్పష్టంగా వ్యాఖ్యానిస్తున్న సందర్భం ఇది.
ప్రకృతి సౌభాగ్యాన్ని మానవజీవన వికాసాన్ని జమిలిగా భావనచేస్తూ ఈ కవి ఇంకా చెప్పుతున్నాడు
‘‘ఒక జల్లు వెన్ను తడితే
వేళ్ల కాళ్లకు నీళ్ల పదను అంటితే
మోళ్లపక్కల నుండే చివుళ్లు
పైకి పరిగెత్తడానికి పదునెక్కుతాయి’’ (నింగిడి).
వానజల్లు మనిషి నేస్తమై వెన్నుతడుతుంది. మన బతుకంతా ఈ వానజల్లు మీద ఆధారపడి వుంది. చివుళ్లు చూపే ఉత్సాహం సృజనాత్మకతను తెలుపుతున్నది. ఎంత భవిష్యద్భావ సుందరమైనవీ పంక్తులు!
‘‘వర్షంలో తడుస్తూ ఎవరో వచ్చారు
నా లోపలికి వర్షాన్ని మోసుకుని
రాత్రంతా
జల్లు పడుతూనే వుంది నామీద
మాట తడుస్తూనే వుంది నాతోపాటు’’ (యాకూబ్ ప్రవహించే జ్ఞాపకం)
లోపలికి వచ్చింది అనుభవం. అది శబ్దరూపమై వచ్చింది. ఈ అనుభవం రాత్రంతా జీవితం అంతా అనుభవాన్ని తనపైన కురుస్తూనే వుంది. అనుభవాన్ని మోేన శబ్దమూ దాని సాంద్రతను కోలుపోకుండా ప్రకాశిస్తూనే ఉన్నది. అనుభవం సాంద్రం కావటంవల్ల దాన్ని వర్షంగా అభివర్ణించారు కవి. కావ్యం విశ్వజనీనం, దేశకాలాతీతం కావటంవల్ల అది నిరంతరం కురుస్తూనే వుందంటున్నాడు మరొక కవి.
‘నాకు మాటలపై అధికారం లేదు. వృత్తాల పోకడ తెలియదు. రసభావ ఔచిత్యములూ, శయ్య అర్థము, అర్థము, లక్షణము, గుణము, అలంకారమూ ఇవేవీ నా కవిత్వంలో లేవు. నా కవిత్వం ‘నగ్నోద్విగ్న’మైంది’ అంటున్నాడు కవి. నగ్నత్వం ఏ నియమాల బరువూ, అదుపూ లేకపోవటం, ఉద్విగ్నత ప్రత్యగ్రంగా, సహృదయుని వెంటపడి అతని చిత్తాన్ని ఆక్రమించగలగటాన్ని సూచిస్తున్నది.
లోకంలోని దంభమును, తెచ్చిపెట్టుకున్న గాంభీర్యాన్నీ కవి చిత్రంగా ఆక్షేపిస్తు న్నాడు
‘‘మనసు గదిలో ఒక రహస్య జ్ఞాపకాన్ని
అతి జాగ్రత్తగా పదిలపరచిన అరని
పొరపాటున కూడా తెరవకూడదు’’
అంటూ మనుష్యలు అంతర్జగత్తులోనుంచి బయట పడ్డప్పుడు ఎలా ఉంటారో వివరిస్తాడు.
‘‘తమదే అయిన దుఃఖనిధినుంచి
అశ్రువులు జారిపడకుండా
పదేపదే కన్నులొత్తుకుంటారు’’
అంటాడు. కవిత్వం రహోవీధిని ప్రతిఫలింపజేయాలి. అలా చేయలేక కేవల బౌద్ధికమైన, ఔపదేశికమైన సరళరేఖల్లాంటి పంక్తులు కవిత్వం ఎప్పుడూ కాలేవు.
‘‘ఏ ప్రతిబింబమూ చూపించలేని
లోతైన ఒక నూతిలోనికి
తొంగిచూడకపోవటమే మంచిది’’ (విన్నకోట రవిశంకర్ వేసవివాన)
వైషమ్యాలను చవిచూస్తూ సాగిపోవటమే జీవన రహస్యం. చివరకు జయించేది మృత్యువే. ఈ అసహాయతను చిత్రిస్తూ
‘‘జీవజలాన్ని భద్రపరచుకుందామనే దోనిలి
అసహాయతను నేను చూశాను’’ (వి.ఆర్.విద్యార్థిఘర్మసముద్రం)
అందుకే ఈ కవి జీవితాన్ని నవ్వుల వెన్నెలా కాదు, బాధల చీకటీ కాదు, అంచనాలకు అతీతమైన అనుభవం అని నిర్వచిస్తాడు.
నేటి జీవనంలోని ఇంధన కాలుష్యం, వాహన కాలుష్యం ఎలా మానవుణ్ణి తరిమి తరిమి చంపుతున్నదీ ఇంతకు పూర్వం సృష్టిలోనే కలుగని అపూర్వమైన సంక్షభం. అజగరంలాగా ఇదీ మానవజాతిని క్రమ్ముకొంటూ, మృత్యుపరిష్వంగంలోకి నెట్టివేస్తున్నది.
‘‘రోడ్డుమీద ఏడడుగుల ఎత్తులో
నీలిరంగు మేఘసర్పం నిన్ననుసరిస్తున్నప్పుడు
మారుమూల మలుపుల్లో
మృత్యుగహ్వరాలు రారమ్మని పిలుస్తున్నప్పుడు
నిన్ను నీవే కాస్తకాస్త నంజుకు తిన్నట్లు
మనిషీ! నీకు అనిపించదా?
ప్రపంచ యుద్ధాలన్నింటినీ మించిన జననష్టం
ప్రమాదాల్లో ప్రవహించడం కన్పించదా?’’
(లంకా శివరామప్రసాద్ మూడుస్వప్నాలుఒక మెలకువ)
‘ఏడడుగుల ఎత్తు నీలిరంగు మేఘసర్పం’ మనిషికన్నా ఈ కాలుష్యం ఎంతో ఎత్తనీ, మేఘసర్పం అన్నమాటవల్ల జీవనాన్నిచ్చే మేఘం, సర్పంగా మృత్యువుగా మారిపోవటం స్ఫురింపజేస్తున్నది.
అయితే మనిషిని నిలబెట్టేది ఆశ, స్వప్నం, సంకల్పం, ఉద్యమం.
‘‘బతకాలన్న తెగింపే
చావాలన్న ముగింపుకన్నా గొప్పది
నాకిప్పుడు చచ్చిన మనిషి ప్రాణం కావాలి
సమాధులమీద అమృతం కురిపించే నిద్ధులు కావాలి
సంచరించే ఆత్మలకు రక్తమాంసాలద్దే ప్రవక్తలు కావాలి’’
(పొట్లపల్లి శ్రీనివాసరావు)
ఇది వాచ్యాతిశాయి భావుకత. చచ్చిన మనిషి ప్రాణం కావాలి. ‘అతి మృత్యుమేతి’ అన్న ఉపనిషద్భావంలోనికి ఇది సంగమిస్తున్నది.
తెలుగు కవితాజగత్తులో కొంతకాలం క్రితందాకా నినాదాలు, పతాకాలు, వచన ప్రాయమైన ఖండఖండ వాక్యాల గుంపులు కవిత్వంగా ప్రవర్తించాయి. దశాబ్దం పైగా కవిత్వం మళ్లీ తన స్వన్థితికి చేరుకుంటున్నది. అప్పుడు రాజకీయ పార్టీలు కవిత్వానికి ‘మంత్రసాని’తనాన్ని అభినయించినాయి.
కొన్నిచోట్ల కవిత్వం వాచ్యమేమోనన్నట్లుగా ఉంటుంది. దీన్ని ‘వాచ్యాభాస’ మని అనవచ్చును. సామాన్యోక్తి జీవనతత్త్వాన్ని వ్యాఖ్యానిస్తుంది. ఎక్కడైనా చెడ్డ కుమారుడు పుట్టవచ్చును కాని ఎక్కడా చెడు తల్లి ఉండదు’ అన్న ప్రాచీన స్తోత్రంలోని వాక్యం సామాన్యవాచ్యస్థాయిలో ఉన్నట్లు కనిపించినా మాతృస్థానము, వాత్సల్యము పెంచే సందర్భంలోని త్యాగ మధురిమ అన్నీ ఓతప్రోతంగా వెలికివస్తాయి.
‘‘పుట్టుక నీది
చావు నీది
బ్రతుకంతా దేశానిది’’
అన్న కాళోజీ వాక్యం ఇలాంటిదే. ఈ వాక్యంలో లోకనాయకుడైన జయప్రకాశ్ సమస్త జీవితమును దేశమాతృపదాలపైన పూజాసుమంగా అర్పించిన అంశం ఉజ్జ్వలంగా ప్రకాశించింది. ఆయన చేపట్టిన ఉద్యమాలన్నీ తరంగాలుగా తాకుతున్నవి. ఆయన చేతిలో లేనివి జననమరణాలే. అవి పరవశమై మార్చరానివి. జన్మమృత్యువుల పారవశ్యం నడుమ బ్రతుకును త్యాగమయం చేనికోవలనిన ఉదాత్తభావం ఎన్నో తాత్త్విక మణి కాంతులను ప్రకాశింపజేస్తున్నది.
కనిపించేదానికన్నా వాస్తవం భిన్నంగా ఉంటుంది. మనుష్యల స్వభావాన్నీ, జగద్వ్యవహారాన్నీ, ఈ సూత్రంతోనే కొలవాల్సి వుంటుంది. ఇంద్రియాల పరిమితి గ్రహించగలిగి వుండాలి.
‘‘సముద్రం మహాగడుసు
చూట్టానికి ముదురు నీలంగా కన్పట్టి
చేతిలోకి తీసుకుంటే వేళ్ళమధ్యగా
రంగు జారిపోతుంది’’ (దీవి సుబ్బారావు వైశాఖ సముద్రం)
ఏదైనా అనుభవ వేళలోనే ఆత్మన్థితి దర్శనం కలుగుతుంది. పైపై చూపులు ఆభాసలే. అందుకే ‘రవిగాంచనిచో కవి గాంచు’ననే మాట పుట్టింది.
ప్రతిక్షణమూ కొత్తగా రూపుగట్టించటం కవిత్వం లక్షణం. యుగయుగాలుగా చూస్తూ వున్నా కవిత్వంగా మారిన వస్తువు, చివరకు ఎప్పటికీ క్రొత్తగా అనుభవనీమల్లో సాక్షాత్కరిస్తుంది. ఆరువందల ఏండ్లక్రితం లల్లాదేవి ఇలా అన్నది
‘‘చెలువ చిత్తము క్రొత్త, శశిరేఖయును క్రొత్త
చెలువ నెమ్మెయి క్రొత్త, జగమెల్ల సరిక్రొత్త
శివకృపాసలిలముల జలకమాడెనుగాన
తడిని, ‘లల్లా’దేవి తనకు తానే క్రొత్త’’
(లల్లాదేవి వాక్కులు మల్లంపల్లి శరభయ్య అనువాదం)
శివకృపా సలిలాలలో తడినిపోయిన లల్లాదేవి తనను తాను గుర్తింపలేనంతగా దివ్యచైతన్యంగా మారిపోయింది. అందుకే కవిత్వం నిరంతరం సాగిపోయే పరిణామ చక్రభ్రమణం, అభినవలోచనం, భావుకులకు అమృతాభిషేకం.

Reviews

There are no reviews yet.

Be the first to review “కవిత్వం నిరంతర పరిణామ చక్ర భ్రమణం
సుప్రసన్నాచార్య.”

Your email address will not be published. Required fields are marked *