వెయ్యిన్కొక్క నవలలు రానిన కొవ్వలి
డా.వేదగిరి రాంబాబు

ఆ గ్రంథ రచన వాడుకభాషలోనే చేయాలనే న్థిరనిశ్చయానికి రావడానికి ఒక సంఘటన ప్రధాన కారణమైంది
ఆయన చూస్తుండగానే అక్కగారి ఇంటి ప్రక్క ఇంట్లో ఉన్నామె ఒక మహాకవి రానిన ఖండకావ్యంలోంచి సర్రున ఓ పుటని చించి దాంతో తన బిడ్డ విసర్జించిన మలాన్ని ఎత్తి పారేనింది.
లక్ష్మీనరనింహారావుగారి మనసు క్షభించింది.
ఆవిడని కాస్త ఘాటుగానే ప్రశ్నించారు.
‘‘ఇది ఎంత గొప్ప గ్రంథమో మీకు తెలుసా? ఈ గ్రంథంలోని పుటని చించి ఇలా ఉపయోగించడానికి మీకు మనెనలా వచ్చింది? అసలు ఈ గ్రంథాన్ని మీరు చదివారా?’’ అని ప్రశ్నించారు.
‘‘నేను చదవడానికి ప్రయత్నించానుగాని అందులోని భాష నన్ను చదవనివ్వలేదు. ఆ భాషని అర్థం చేసుకునే శక్తి నాకు లేదు. అర్థం కానిది ఎంత గొప్ప గ్రంథమైతేనేమిటి?’’ అంటూ ఆమె తిరిగి ప్రశ్నించారట.
ఆమె జవాబు కొవ్వలి లక్ష్మీనరనింహారావుగారిలో ఉవ్వెత్తున ఆలోచనల్ని రేపింది
రకరకాల ఆలోచనలు
రకరకాల అనుమానాలు
రకరకాలుగా ఇబ్బంది పెట్టసాగాయి.
ఏమాత్రం ఈర్ష్యాద్వేషాలకు లోనుకాకుండా ఉండాలని ప్రయత్నించారు.
సంచారిగా ఊళ్ళు పట్టుకుని తిరగసాగారు.
ఎందుకు ఏ దారిలో పయనిస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. ఐనా తిరుగుతూనే ఉన్నారు.
ఒంటరిగా ఓపికతో తిరిగే ఆయన ‘ఔరా’ అనిపించేట్టు మూడు నాలుగు సంవత్సరాల పాటు కనిపించిన ప్రతి పుస్తకాన్ని చదవడం ఏ తల్లయినా పిలిచి అన్నం పెడతే తినడం ఏ అరుగుమీదో నిద్రపోవడం చేశారు. ఇలా తిరగడంతో ఆయన ప్రజల భాషని, ముఖ్యంగా ఆడవాళ్ళు అర్థం చేసుకోగల భాషను బాగా అధ్ట్యయనం చేశారు. గ్రంథభాషనీ అధ్యయనం చేశారు. ఎన్నో గ్రంథాల్ని చదివి అప్పటి రోజుల్లో ప్రజలకు ముఖ్యంగా, న్ర్తీలకు ఎలాంటి సమస్యలున్నాయో, ఎలాంటి గ్రంథాలు కావాలో తెలుసుకున్నారు. అందుకే గమ్యం లేకుండా ఆయన ప్రారంభించిన ప్రయాణమే ఆయనకో గమ్యాన్ని నిర్దేశించింది. లక్ష్యశుద్ధిని కలిగించింది. ఇంటికి చేరారు.
అంతవరకూ కొడుకు కోసం తపిస్తున్న ఆ తండ్రి లక్ష్మీనారాయణ కన్నీరు మున్నీరయ్యారు. బంధువులు, శ్రేయోభిలాషలు సంతోషించారు.
లక్ష్మీనరనింహారావుగార్ని తండ్రి లక్ష్మీనారాయణ కో అపరేటివ్ ట్రయినింగ్‌లో చేర్చారు. కానీ న్థిరనిశ్చయంతో వచ్చిన కొవ్వలి లక్ష్మీనరనింహారావుగారు తండ్రి చెప్పినమాట విని, ఆయనను సంతోషపెట్టలేకపోయారు. తన సామాజిక లక్ష్యం ముందు వ్యక్తిగత కోర్కెలు నిలువలేదు. అలా నిలిచి ఉంటే ఆయన కోపరేటివ్ ట్రయినింగ్ పొంది, జీవితంలో ఏ గుమాస్తాగానో నిలిచిపోయి లక్షల్లో ఒకరయ్యేవారు! సాహిత్యంలో వికనించి, సమాజానికి నవాలా సుగంధాల్ని వెదజల్లాల్సిన ఆ కుసుమం మొగ్గగానే వాడిపోయి ఉండేది.
తెలుగులో అందరూ చదవాల్సిన నవలలు తెలినిన భాషలో రావడానికి కారణమయ్యాయి, ఆయన ఆలోచనలు! తెలుగులో పాఠకుల సంఖ్య గణనీయంగా పెంచే నవలా సృష్టి ప్రారంభమయింది. ఈ ప్రయాణంలో ఆయన రకరకాల సమస్యల్ని ఎదుర్కోసాగారు. అప్పట్లో కేవలం కొంతమందికి మాత్రమే సాహిత్యం అందుబాటులో ఉండేది. నాటి గ్రంథాలు గ్రాంథిక భాషలో ఉండేవి. అందుకే సాహిత్య అజ్ఞానం అధికంగా ఉండేది. అందరికీ అర్థమయ్యే భాషలో చిన్న నవలోద్యమాన్ని, వాడుకభాషలో ప్రారంభించారు. నాటి సమాజానికి అవసరమైన మనుషల్లో ముసుగులు తొలగించే పెద్ద కథల్ని తీసుకుని చిన్న చిన్న నవలలుగా రాయడం ప్రారంభించారు.
ఆయనలా నవలా రచనోద్యమాన్ని ప్రారంభించిందిడబ్బుకోసం కాదు, పేరుకోసం అంతకన్నా కాదు. అప్పటి సమాజంలో న్ర్తీల న్థితిగతుల్ని మెరుగుపరచడానికి. కొవ్వలి న్ర్తీ పక్షపాతి. అప్పట్లో సమాజం న్ర్తీలనే అంతగా పట్టించుకునేదికాదు. ఇక న్ర్తీల సమస్యలు… ముఖ్యంగా సున్నిత సమస్యలని అసలెందుకు పట్టించుకుంటుంది? అందుకని ఆ బాధ్యతని కొవ్వలివారు న్వీకరించారు.
రాజమండ్రిలో శ్రీపాద సుబ్రహ్మణ్యశాన్ర్తిగారు, కొవ్వలివారు మరే వృత్తి బ్రతుకుతెరువుకు న్వీకరించకుండా ప్రజలలో మానవత్వం పెరగడానికి, భేదాలు సమనిపోవడానికి అదే జీవితాశయంగా రచనలు చేసుకుంటూ పోయారు. అందుకే ఇద్దరూ ఇతరులెలా భావించినా పట్టించుకోలేదు.
డా.వేదగిరి రాంబాబు
93913 43916

Reviews

There are no reviews yet.

Be the first to review “వెయ్యిన్కొక్క నవలలు రానిన కొవ్వలి
డా.వేదగిరి రాంబాబు”

Your email address will not be published. Required fields are marked *