All Is Lost (2013)

Category:

సంవత్సరాల తరబడి అనేక సినిమాల్లో పనిచేశాక లెజెండరీ నటుడు పాల్ న్యూమన్ కు అర్థమయ్యిందేమిటంటే ఒకవైపు డైరెక్టరూ ఇంకో వైపు ఎడిటరూ కలిసి అనేక కాంప్లెక్స్ సినిమా ఎలిమెంట్లని తెరపైకి తీసుకువచ్చేలా కృషి చేస్తున్నప్పుడు నటుడు చేయాల్సిందంతా ఎంతమేరకు నటించాలో తెలుకుని సరిగ్గా అంతమేరకే నటించడం. Less is More ( ఈ సంగతి Rotten Tomatoes నుంచి లేపేసినామని మనవి )

హిందూ మహా సముద్రానికి దరిదాపుల దాకా షికారు కి వచ్చిన అతను పొద్దున్నే సగం నిద్రలో లేచి చూస్తే తన Yacht ( మధ్యస్థంగా ఉండే ఒక పెద్దసైజు Boat, తెరచాపలతో గానీ, ఇంజిన్ తో గానీ నడవగలిగి సాహసయాత్రలకి అనుకూలంగా ఉండేది ) లోపలంతా పాదాలు మునిగే ఎత్తు వరకూ నీళ్ళు లోపలకి వచ్చేసి ఉంటుంది. నిద్ర మొహంతో ఇతను మొత్తం పరికించి చూస్తే నడి సముద్రంలో సగం మునిగి ఉన్న ఒక కంటైనర్ మూలకు తగిలి బోట్ కి చిల్లుపడి నీళ్ళు లోపలకి వస్తూ ఉంటుంది. తెరచాపని సరిచేసి కంటైనర్ నుంచి దూరంగా జరిపి బోట్ పరిస్థితి చూస్తాడు. నీళ్ళు తోడెయ్యొచ్చు కానీ అప్పటికే అన్ని రకాల సమాచార వ్యవస్థలు మొత్తం పాడైపోయి ఉంటాయి. బోట్ పైకి ఒక్కొటొక్కటిగా తెచ్చి పరిస్థితిని దగ్గరున్న సహాయ కేంద్రానికి చెప్పాలనుకుంటే వాకీ టాకీ కొంచెం సేపు పనిచేసి ఆగిపోతుంది. బేటరీ పనిచెయ్యదు. శాటిలైట్ ఫోనూ పని చేసే స్థితిలో ఉండదు. చిల్లుల్ని సరిచేసే ప్రయత్నం చేసి బోట్ ను వీలైనంతగా బాగు చేసే ప్రయత్నం చేస్తాడు. ఒకట్రెండు రోజుల్లో భీకరంగా సముద్ర తుఫాను విరుచుకు పడుతుంది. బోట్ మూడింతలు మునిగిపోతుంది. వళ్ళంతా గాయాలు. నుదురు బాగా చిట్లి కారుతున్న రక్తం. శరీరం వ్రణమైపోయినట్లు కనిపిస్తూంటుంది. లైఫ్ సేవింగ్ కిట్ సహాయంతో బయటకు వచ్చి బోట్ పూర్తిగా మునుగుతుంటే వీడ్కోలు చెప్తాడు.

కొన్ని రోజులకు వర్షం మళ్ళీ భీభత్సంగా కురిసి అన్నిటినీ తలకిందులు చేసి వెళ్ళిపోతుంది. తినడానికి ఆహారం నిండుకుంది. తాగే నీళ్ళుందామని చూస్తే కేన్ లో మొత్తం సముద్రం నీళ్ళు వచ్చేసి ఉంటుంది. ఇటు చూస్తే వంట్లో గాయాలు. చేపలు పట్టే చిన్న గాలం లాంటిది ఉంటే సముద్రంలో జారవిడిచి చేపలేమైనా పడతాయేమోనని ఎదురు చూస్తూ ఇంకో వైపు కేన్ ను చిన్న నీటితొట్టెలాగా చేసుకుని, సముద్రం నీళ్ళు కాసింత నింపి పైన ప్లాస్టిక్ కవరు ఒకదాన్ని అతికించి నీళ్ళు ఎండకు ఆవిరౌతూంటే ఆ ఆవిరి చుక్కల్ని టిన్నులో పట్టుకుని తాగుతూంటాడు. సత్తువ పోతూ నీరసంగా ఒకవైపు పడుకుని చూస్తూంటే పక్కనే కంటెయినర్ ఓడ ఒకటి వెళ్తూ ఉంటుంది. పట్టపగలైనా వేరే దారిలేక ఎమర్జెన్సీ లైటర్స్ ని వెలిగించి సహాయం కోసం అరుస్తాడు.ఉపయోగం ఉండదు. ఓడ నిశ్శబ్ధంగా వెళ్ళిపోతూ ఉండగా నిస్సహాయంగా చూస్తూ నిలబడతాడు. కాసేపటికి గాలం కదులుతూ ఉండగా ఆశగా గాలాన్ని పైకి తెస్తూంటే చిన్న చేప తగిలి ఉంటుంది. దాదాపు చేతికందే దూరంలోకొచ్చేసరికి ఉన్నఫళంగా ఒక పెద్ద సైజు చేపొకటి ఆ పిల్ల చేపని నోట కరుచుకుని వెళ్ళిపోతుంది. చేతికందుతూ ఉండగా నోటికందకుండా జారిపోయిన విధి. అప్పుడే గమనిస్తాడు చుట్టూ పదుల సంఖ్యలో ప్రమాదకరమైన షార్క్ చేపలు తిరుగాడుతూంటాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, అభావంగా నిశ్చలాకాశం వైపు చూస్తూ చప్పుడు చేయకుండా ఉండిపోతాడు.

ఆశలు ఒక్కొటొక్కొటిగా ఆవిరౌతూ ఉంటే వంట్లో బలం తగ్గిపోతూ ప్రాణాలు క్షణాల లెక్కన శరీరం నుంచి వేరౌతూ ఉన్న దశలో, మిగులున్న సరంజామాలోంచి డైరీ తీసి ఒక చిన్న ఉత్తరాన్ని రాస్తాడు. ఇలాంటి సమయంలో ఉపయోగపడడానికేనా అన్నట్లు ఒక గాజు సీసా కనిపిస్తే అందులో ఉత్తరాన్ని దాచి మూత బిగించి సముద్రంలోకి విసిరేసి దానివైపే చూస్తూ కూర్చుంటాడు. తనకు మాత్రమే చెందిన చివరాఖరుది ఏదో జారిపోతూ ఉండగా నిశ్చలంగా చూస్తూ, అలౌకిక స్థితిని ప్రకటిస్తూ ఉన్న హావభావాలు. ఆ ఉత్తరం ఇది.

13th of July, 4:50 pm. I’m sorry. I know that means little at this point, but I am. I tried, I think you would all agree that I tried. To be true, to be strong, to be kind, to love, to be right. But I wasn’t. And I know you knew this. In each of your ways. And I am sorry. All is lost here, except for soul and body, that is, what’s left of them, and a half day’s ration. It’s inexcusable really, I know that now. How it could have taken this long to admit that I’m not sure, but it did. I fought till the end. I’m not sure what that is worth, but know that I did. I have always hoped for more for you all. I will miss you. I’m sorry.

చీకటౌతుంది, రోజుల లెక్క మనకర్థం కాదు. ఏదో శబ్ధానికి మెలకువ వస్తుంది. శక్తియుక్తులన్నీ క్షీణావస్థలో ఉంటాయి. లేని ఓపిక తెచ్చుకుని, ఉన్న కాస్త బలమూ ఉపయోగిస్తూ తన దగ్గరున్న ఎమర్జెన్సీ టార్చ్ ని వెలిగించి ఆకాశం వైపు పేల్చుతాడు. పక్కనే ఇంతకు ముందు చూసిన రవాణా ఓడ కంటెయినర్లతో నిండుగా నిండు గర్భిణీలాగా నెమ్మదిగా గంభీరంగా వెళ్తూంటూంది ఆ నడి సముద్రంలో. ఏ స్పందనా లేదు వెళ్ళిపోతున్న ఓడ నుంచి. ఇంకోటి వెలిగించి పేలుస్తాడు ఆకాశం వైపు. ఈ సారి కూడా ఏ చప్పుడూ ఉండదు అవతలివైపు నుంచి. దూరంగా కనుమరుగౌతున్న ఓడని అతను ఆ సన్నని వెలుగుల్లో చూస్తూ ఉండగా నిదానంగా అతని ముఖం వైపు ఫోకస్ అవుతూ ఉంటుంది కేమెరా. ఆ హావభావాలు దిగ్గజ నటులకే సాధ్యం. అనితరసాధ్యమైన భావాల్ని పలికించాడాయన. కూలబడేందుక్కూడా వంట్లో ఓపిక ఉండదు. మనకూ అర్థమౌతుంది, అది ఒక సమాధి స్థితి. స్మశాన వైరాగ్యం ఎలా ఉంటుందో కనిపిస్తుంది. జవజీవాలన్నీ తిరుగుబాటు చేస్తూ ఉండగా మిణుకుమిణుకుమంటూన్న ప్రాణం చిట్ట చివరి యుద్దం చేయడానికి మిగిలున్న శరీరంలో కొట్టుకుంటూ, తాపత్రయంలో కొట్టుమిట్టాడుతూండడం చూస్తాం. అక్కడ అతనితో బాటూ మనమూ ఉన్నామని మనక్కూడా స్ఫురణకు వస్తుంది.

దాదాపు స్పృహ కోల్పోయిన మనిషి ఆ రాత్రి మళ్ళీ ఎందుకో కళ్ళు విప్పారించి ఆ వైపు చూస్తాడు. సన్నటి వెలుగు దూరంగా కదులుతూ వస్తూంటుంది. వెళ్ళిపోతూ ఉందో ఏమో కూడా. అప్పటికప్పుడు చావు బలం వస్తుంది. డైరీలో మిగిలిన కాగితాల్ని చింపి, దగ్గరున్న అగ్గిపుల్లల్తో కాగితాల్ని ప్లాస్టిక్ తొట్టెగా మారిన కేన్ లో మండిస్తూ చేతులూపుతాడు. ఆ వెలుగులో మనిషి జాడ కనిపించి దగ్గరికొస్తారని. ఆశ చావదు. అవతలివైపు నుంచి ఏ ప్రత్యుత్తరమూ కనబడదు. మొత్తం డైరీతో బాటు తక్కిన మండే వస్తువుల్ని కూడా మంటల్లో విసిరేసి మంటల్ని పెద్దగా చేసి సహాయం కోసం చేతులూపుతూ నిలబడతాడు. ఆశ నిరాశ అవుతూందేమో అనిపించేంతలో మంటలు పెద్దదై ఇన్నాళ్ళూ ప్రాణాల్ని నిలబెడుతూ వస్తున్న ఉంటున్న గుండ్రటి ప్లాస్టిక్ తెప్పకు మంటలంటుకుంటాయి. ఆర్పే ప్రయత్నంలో మంటలు ఇంకా పెద్దదైపోయి నీళ్ళల్లోకి దూకాల్సి వస్తుంది.

అంతా సమూలంగా నాశనమైపోయింది. వట్టిచేతుల్తో, కొన ప్రాణాలతో ,అన్ని ఆశలూ ఆవిరైపోయి, నిస్సహాయంగా చిట్టచివరి ఆధారమూ మంటల్లో కాలిపోతూ ఉండగా ఆ వెలుగులో ఒక మనిషి ఆత్మత్యాగం ఎలా చేసుకుంటాడో చూడాలి. ఆ మంటల వైపు నిలిపిన ఆ కళ్ళల్లో వేదనా, దుఖఃమూ, ఏ చలనమూ లేకుండా ఋష్యత్వం సాధించినట్లు కనబడే అభావ స్థితి మనకు కనబడుతూండగా రెండు క్షణాల తరువాత సముద్రంలోకి, ఆ కటిక చీకటి లోతుల్లోకి జారిపోతాడు.

అతనిపై జాలి కలగదు. కానీ అప్రయత్నంగా కళ్ళవెంబడి నీళ్ళొస్తాయ్. ప్రమాద స్థితి నుంచి నిస్సహాయ స్థితిలోకి, మరణంలోకి ఒక్కొక్క క్షణం చొప్పున జారిపోతూ ఉండగా ఆ మనిషి ఎలాంటి పాఠాల్ని చెప్తున్నాడు? పోరాడడమా? పోరాడినా ఏమీ మిగలదనే వైరాగ్యమా? ఎప్పటికైనా పోయే ప్రాణం కోసం అంత గా కొట్టుమిట్టాడడం అనవసరమనా? తీరా చూస్తే అరవై అయిదు దాటేసినట్లున్న ఆ మనిషి పోరాటానికి ఇస్తున్న ఊతం ఏది? ప్రాణం పై కేవలం తీపి మాత్రమేనా ఉంది అందులో? చాలా ప్రశ్నలే మిగులుతాయి ఈ సినిమా చూశాక.

ఆగండి. తరువాత ఇంకో రెండు నిమిషాల సినిమా ఉంది. అది చూస్తేనే కథకి సార్థకత. మనకేం ఒరిగిందో ఇతమిద్ధంగా చెప్పడానికీ, కథలో నీతిని, ఆ పాత్ర ద్వారా చెప్పదల్చుకున్న జీవిత సత్యాన్ని డెసిఫర్ చేయడానికీ నాకు కుదరడంలేదు.ఏమీ అర్థం కాకపోవడంలోనే అనల్పమైన అర్థాలు దాగి ఉన్నాయా?

మొత్తం సినిమాలో సొంత గొంతుతో చదివే ఉత్తరం ఒకటి. F……K అనే ఒక ఇరవై సెకండ్ల దావానలం బయలుదేరిన వేదనతో లేచే గొంతుక ఒకటి. చివర్లో ‘హెల్ప్’ ‘హెల్ప్’ అంటూ పలికే రెండుమూడు మాటలు. సినిమా మొత్తం అంతే. డైలాగులు లేవు. జీవిత సత్యాల్ని వడపోసి చెప్పే జ్ఞాననివేదనాత్రుత లేదు. అన్నీ వివరంగా చెప్పకుండా మనల్నే తెలుసుకోమంటున్న జిడ్డు కృష్ణమూర్తి కనిపించాడు.

ఈ సినిమా నాటికి ఒకప్పటి హాలీవుడ్ మగధీరుడూ, మేచిస్మోలకి, గ్రీకు వీరులకి పెత్తాత లాంటి రాబర్ట్ రెడ్ ఫోర్డ్ వయసు 77. దర్శకుడికి ఈ సినిమా రెండవది. మొదటి సినిమా Margin Call లో ఇంకో వయో వృద్ధుడు Jeremy Irons చేత వికటాట్టహాసం చేయించాడు. అది కూడా పక్కన Kevin Spacey లాంటి ఉద్దండుడు నటిస్తూండగానే.

మంచి సినిమా. ముందుగా ఇతర రెవ్యూలు చదివి సినిమా చూడాలా వద్దా అనేది నిశ్చయించుకోండి. అంత నిశ్శబ్ధాన్ని, ఒకే ఒక నేపధ్య సంగీతాన్ని వినిపిస్తూ గంటా నలబై నిమిషాలు ఒకే మనిషి తెరపై కనిపించే సినిమా చూడడం అందరికీ వీలయ్యే పని కాదు. కానీ సినిమా సాంతం చూస్తే మాత్రం ఒక బ్రహ్మాండమైన సెల్ఫ్ డిస్కవరీ మాత్రం సాధ్యం. ఆ డిస్కవరీ ఏదో వారి వారి అనుభవాలకే పరిమితం.

I will recommend this movie without a doubt if you ask Me. సంవత్సరాల తరబడి అనేక సినిమాల్లో పనిచేశాక లెజెండరీ నటుడు పాల్ న్యూమన్ కు అర్థమయ్యిందేమిటంటే ఒకవైపు డైరెక్టరూ ఇంకో వైపు ఎడిటరూ కలిసి అనేక కాంప్లెక్స్ సినిమా ఎలిమెంట్లని తెరపైకి తీసుకువచ్చేలా కృషి చేస్తున్నప్పుడు నటుడు చేయాల్సిందంతా ఎంతమేరకు నటించాలో తెలుకుని సరిగ్గా అంతమేరకే నటించడం. Less is More ( ఈ సంగతి Rotten Tomatoes నుంచి లేపేసినామని మనవి )

I will recommend this movie without a doubt if you ask Me.

Reviews

There are no reviews yet.

Be the first to review “All Is Lost (2013)”

Your email address will not be published. Required fields are marked *