వాత్సల్య నిధి చక్రపాణి • యన్ టి. రామారావు

Category:

1949వ సంవత్సరం నుంచీ ‘ నాకూ విజయాసంస్థకూ ఒక అనుబంధం ఏర్పడింది. నా సొంత ఇంటి కంటె వాహినీ స్టుడియో చొరవ, నా కుటుంబ సభ్యులకంటే కూడా, శ్రీ నార్తి – చక్రపాణిగార్లతో ఆప్యాయత ఆనాడు చిత్ర నిర్మాణం అంటే ఒక మహత్తర కార్యంగా భావించే వాళ్ళము. అంత భావనలో కూడా ఆ చక్రపాణిగారు చటుక్కున ఇచ్చే సూచనలు వింటూ వుంటే ఏమిటలా మాట్లాడతారు అనిపించేది. ఏదో తేలని నమన్నతో సతమతమవుతూ, అతి ముఖ్యమైన సన్నివేశాన్ని ఎలా మలచాలో తెలియక మా పెద్ద దర్శకులందరూ తికమక పడుతూ వుంటే ‘ఏంటి ఇది ఇట్లా చేస్తే పోలా’ అని చక్రపాణిగారు ఎంతో తేలిగ్గా, సూక్ష్మంగా, విజ్ఞతతో ఆ చిక్కుల్ని విడదీ నేవారు. అందుకనే నేను చిత్ర నిర్మాణం ” మొదలు పెట్టి, దర్శకుడినైన తర్వాత కూడా ఆయనను ఆత్మీయుడైన వ్యక్తిగా కంటె ఒక నిమంటువుగా గౌరవించేవాడిని. సామాన్యంగా ఆయనను అర్థంచేసుకోడం ఎవరికైన కష్టమే. కట్టె విరిచినట్టుగా మాట్లాడటం, తనకు తోచినదేదో సూటిగా, నిర్మొహమాటంగా చెప్పడం ఆయనలోని ప్రత్యేక లక్షణాలు. ప్రత్యేకంగా వారిని కోరినా కోరకపోయినా, తన వాళ్ళు అనుకున్న వాళ్ళకు ఏ విషయంలోనైనా గాన్ని సలహాలు, సూచనలు ఇవ్వడం, వాళ్ళెప్పుడూ బాగుండాలనుకోడం, ఆయన ప్రత్యేకత చక్రపాణి గారికి కొన్ని కొన్ని నమ్మకాలుండేవి. ఎవరు ఏమన్నా సరే, ఆ నమ్మకాలను మాత్రం ఆయన దూరం చేసుకోలేదు. నేను చిత్రాల్లో ఏవైనా విషాద దృశ్యాలలో నటిస్తున్నానని తెలిస్తే ‘ఆ ఏమిటి రామారావ్ నువ్వు ఏడిస్తే ఎవరు చూస్తారు ఏదైనా మగతనంగా, నలుగురూ సాధించలేని కార్యమేదో సాధించగల పాత్రయితేనే జనానికి నచ్చుతుంది గాని, నువ్వు ఏం ఏం నచ్చుతుంది ! నువ్వు ఎప్పుడూ కళ్ళకు గ్లిసరిన్ పెట్టక అనేవారు. నేనేదైనా ఆయనకు నచ్చని వని తల పెడితే ‘రామారావు వితండం మనిషి మిలైనా వెళ్ళి చెప్పండి’ అని కబురు వం పేటంతటి పితృవాత్సల్యంగల వ్యక్తి. నేనూ, నా కుటుంబం ఎప్పుడూ క్షేమంగా వుండాలనీ నేనెప్పుడూ నవ్వుతూ కనిపించాలని కోరుకునే మహనీయుడు ఆయన చలనచిత్ర నిర్మాతగా, రచయితగా నిర్మాణం మిద చిత్ర రచన మీద వారికి వున్న భావనలు వేరు. చిత్రాల ద్వారా మన సమాజాన్ని మరమ్మతు చెయ్యాలి అన్న నమ్మకం ఆయనకు వుండేదికాదు. హాస్యరసంతో సరదాగా నవ్విస్తూ సినిమా నడిచిపోవాలన్న ధోరణి ఆయనది. మన చుట్టూ నిత్యం కనిపించేటటువంటి సామాన్య ప్రకృతి కలిగినటువంటి పాత్రలను వాటి మనస్తత్వాలనూ, హృద్యంగా, ఆహ్లాదకరంగా సృష్టించడం వారి పాత్ర కల్పనల ప్రత్యేకత. ‘షావుకారు లోని రంగడు, రామిశెట్టి, పెళ్ళిచేసి చూడు లోని వియ్యన్న, ‘భీమన్న, మిన్సమ్మలోని మిన్సమ్మ, దొంగ బిచ్చగాడు రేలంగి,
గుడమ్మ కథలోని నా పాత్ర, శ్రీమతి ఛాయాదేవి ధరించిన పాత్ర ఇత్యాది పలు పాత్రలు వారి సవికి కొన్ని నిదర్శనాలు సామాన్య సంఘటనలలోంచి మనుషుల్ని గిలిగింతలు పెట్టి మధురానుభూతికి తీసుకువెళ్ళే వాస్తవికతను చూపడం కోసం ఆయన కృషి చేసేవారు. గుండెల్ని బాదుకుని ఏడ్చి ఏడుపుల మీదగాని, నీనిమా పరిభాషలోని మెలోడ్రామా మీదగాని ఆయనకు నమ్మకం వుండేదికాదు. సునిశితమైన హాస్యం వారికి ప్రీతికరమైనటువంటిది. ఎంతో తీవ్రమైన సంఘటనల్లోనైనా వన్య ప్రధానమైన చెణుకు లేకుండా వారి కల్పన వుండేదికాదు. దీనికంతటికీ కారణం వారి జీవితానుభవం, బహుభాషా సాంగత్యం, పరిశీలనా దృక్పథం అని నేను అనుకుంటాను. వంగభాషలో వారికి వున్న పరిచయం పేర్కొనలగది. శరతీబాబును తెలుగువారికి చిరస్మరణీయుడుగా పరిచయం చేసిన ఘనత శ్రీ చక్రపాణిగారిదే. ఆ భాషా ప్రభావం కూడా వారి మీద ఎంతగానో వుందని నేను అనుకునేవాదుని తన సొంత రచనలలో కూడా అతి సున్నితమైన పాత్రలను ఎంతో బలంగా, మన మనసుల మీద చెరగని విధంగా చిత్రించగలిగారంటే దానికి కారణం ఆ ప్రభావమేననుకుంటాను. : ఆయనకు ఇంకొక గట్టి నమ్మకం వుండేది. చిత్రాలు విల్లలకు బాగా నచ్చితే, పెద్దవాళ్ళకూ తప్పకుండా నచ్చుతాయని , ఆయన విశ్వాసం. గుండమ్మ కథ మొదటి సెట్టు పని పూర్తి కాగానే నాగిరెడ్డిగారి కుటుంబాలు తక్కిన తెలిసిన వారి కుటుంబాల్లోని పిల్లలందర్నీ దాదాపు 150 మందిని పిలిపించి ఆ సెట్టు పని చూపించాడు. నేను సగం నిక్కరుతో తెరమీద కనిపించే సరికి, పిల్లలంతా వింతగా చూసి ఒకటే కేరింతలు కొట్టారు. అది చూడగానే ఆయన ఆ చిత పర్యవసానం ఆనాడి నాతో చెప్పారు. ‘రామారావ్ నీ పాత్ర బ్రహ్మాండం, మన గుండమ్మ కథ బ్రహ్మాండం’ అన్నారు. అదే చిత్రాన్ని విడుదలకు ముందు పెద్దలందర్నీ పిలిచి చూపించారు. అనుభవజ్ఞులందరూ ‘ఏదో పోతుంది’ అన్నారు. ‘మీ నాన్నగారు ఎలా వుందన్నారు’ అని నన్ను ప్రశ్నించారు చక్రపాణిగారు. ఆయన ఇంకోసారి చూడాలంటున్నారు అన్నాను నేను. ‘ఇది మనకు సరైన జడ్జిమెంటు. సినిమా పరిభాష ఏమి తెలియని వాళ్లు చెప్పేదే సరైన నిర్ణయంగాని చిత్ర విజయానికి అవి వుండాలి. ఇవి ఉండాలి. ఈ పాళ్ళు వుండాలి” అనంటారు చూడు దాంట్లో నాకు నమ్మకం లేదు. నేను చెబుతున్నాను విను, ఈ సినిమా బ్రహ్మాండంగా పోతుంది’ అన్నాడు అలాగే ఆ చిత్రం రజతోత్సవం చేసుకుంది. తన శిల్పకల్పన మీద అంత నమ్మకం వారికి, ఎవరేం . చెప్పినా ఆ ఆత్మ విశ్వాసాన్ని వదిలేవారు కారు. ఆ నమ్మ కాల పర్యవసానమే విజయావారు నిర్మించిన చిత్రాల రూపకల్పన. ఆ చిత్రాల విజయం చక్రపాటిగారి నమ్మకాల విజయం అని నా నమ్మకం. ఆయన అభిప్రాయాలు కొంత కటువుగా ఉన్నట్లనిపించినా, తర్వాత తర్వాత ఆయన నిర్ణయాలు ఆచరణలో సరైనవేనని ఎవరైనా అనక తప్పదు. తలచుకుంటూ వుంటే ఆయన గురించి ఇలా ఎన్నో జ్ఞాపకాలు వస్తుంటాయి. నాగిరెడ్డిగారు, చక్రపాణిగారు ఎవరెవరు ఏకులం వారైనా వారి అన్యోన్యత, సోదర భావం, మైత్రీ భావం చిరస్మరణీయం/ కలకాలం ప్రతివారు, వింతగా, ఆదర్శంగా చెప్పుకునే మధురసవం ! వారి చెలిమి చూస్తే మేము నిర్మించబోతున్న దాన వీర హర కర్ణ చిత్రంలోని కళ్ల నుయోధనుల చెలిమిని గురించి నేను వూహించుకుని రాయించిన పాట నాకు గుర్తుకొస్తుంది .
కుల మత భేదం లేనిదీ తరతమ భావం రానిదీ ఆత్మార్పణమే కోరునది ప్రతిఫలమన్నది ఎరుగనిదీ స్నేహమిది
స్నేహమిదీ శ్రీ చక్రపాణిగారు లేని లోటు పూజ్యులు నాగిరెడ్డిగారికి ఎవరూ తీర్చలేని లోటు. ఇక నాకు అనుక్షణం తన బిడ్డగా చూసుకుంటూ నా క్షేమాన్నీ నా కుటుంబ శ్రేయస్సునూ ఆకాంక్షించే విత్సతుల్యులైన ఒక మహనీయుని కోల్పోయాను. నేను ఎక్కడ వున్నానని తెలిసినా ఆత్మీయతతో వచ్చి, ఆప్యాయతతో నోరారా పలుకరించే వాత్సల్య నిధిని నేను పోగొట్టుకున్నాను. వారి పవిత్రాత్మకు భగవంతుడు శాంతి చేకూరాలని నేను మనసారా కోరుకుంటున్నాను. .

మా తండ్రిగారి వూరు తెనాలి

ఎన్ టి. రామారావుగారు తెనాలిలో ఒక ధియేటరు నిర్మించదలచి స్థలం కొన్నాడు. తెనాలిలో ఎందుకు నిర్మిస్తున్నారు అని ఒక మిత్రుడు అడిగితే ‘తెనాలి మా తండ్రి చక్రపాణిగారి వూరు. అందుకు నిర్మించదలిచాను అన్నారు. ” చక్రపాణిగారిని , ఎన్.టి.ఆర్ విత్స సమానులుగా గౌరవించేవారు.

Reviews

There are no reviews yet.

Be the first to review “వాత్సల్య నిధి చక్రపాణి • యన్ టి. రామారావు”

Your email address will not be published. Required fields are marked *