మనిషి.. కులము.. రక్తము..
ముక్కామల చక్రధర్

మనుషుల రక్తం ఎర్రగా కదా ఉండాలి… ?
మనుషుల రక్తం ఉప్పగా కదా ఉండాలి… ?
వాడేంటీ..
రక్తం ^కమ్మ^ గా ఉండాలంటాడు
వాడు రక్తం రుచి మార్చేస్తున్న కమ్మ వన్నె పులి
తల్లి పాలు కూడా కమ్మగా లేకపోతే
రొమ్ము చీల్చేలా ఉన్నాడు ఈ మ్రగజాతి కులపోడు
వొరేయ్.. నీచుడా…
మూడేళ్ల పసిపాపారా…
ఏ కులమూ నీదంటే….
గోకులమూ నవ్వింది అంటూ బోసినవ్వు నవ్వుతుందిరా…
ఆ చిన్నారి పుడుతూ అమ్మ అంది కాని
కమ్మ అనలేదురా
ఎక్కడో మొదలయ్యే ఉంటుంది
సర్పయాగం లాంటి…. కమ్మయాగం
అది పూర్తి కావాలి…
నీలాంటి కులపిచ్చోళ్లు అందులో పడి మాడిపోవాలి

(మూడేళ్ల చిన్నారికి అర్జంట్ గా ఓ పాజిటివ్ రక్తం కావాలని, అది కూడా కమ్మ వారి రక్తమే కావాలంటూ ఓ ప్రబుద్ధుడు ప్రకటన చూసి)

– ముక్కామల చక్రధర్
98484 89172

Reviews

There are no reviews yet.

Be the first to review “మనిషి.. కులము.. రక్తము..
ముక్కామల చక్రధర్”

Your email address will not be published. Required fields are marked *