మీ గర్భంలోనూ అభిమన్యుడు!
కోవెల సంతోష్ కుమార్

మీకు గుర్తుందా? అభిమన్యుడు.. మహాభారతంలో అర్జునుడి కుమారుడు. సుభద్రాదేవి కడుపులో ఉండగానే యుద్ధంలో పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలో తెలుసుకున్నాడట. ఇప్పుడు మీ గర్భంలో శిశువు మరో అభిమన్యుడవుతున్నాడు.. మీ ఇంట్లో అడుగుపెడుతున్నాడు.. పద్మవ్యూహం లాంటి ప్రపంచాన్ని మీ కడుపులో ఉండగానే.. మీ కళ్లతోనే, మీ మాటలతోనే అర్థం చేసుకుంటున్నాడు..మీరు చెప్పింది విని అర్థం చేసుకోగలుగుతున్నాడు.
కురుక్షేత్రంలో ఒకే ఒక్కరోజు అత్యంత కీలకమైన యుద్ధ వ్యూహాన్ని చిన్న కుర్రాడు అభిమన్యుడు ఛేదించటం గొప్ప సన్నివేశం.. ఇంతకీ ఈ పద్మవ్యూహాన్ని ఎప్పుడు నేర్చుకున్నాడో తెలుసా? తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే శ్రీకృష్ణుడు వచ్చి నేర్పాడట..
ఇప్పుడు మీ గర్భంలో ఉన్న శిశువుకు కూడా పద్మవ్యూహం లాంటి ప్రపంచాన్ని చూపించవచ్చు. మీరు కోరుకున్నట్లుగా మీకు పుట్టబోయే శిశువు పెరుగుతుంది. చదువు చెప్పవచ్చు.. సంస్కారం చెప్పవచ్చు..వ్యక్తిత్వాన్ని ముందే డిసైడ్ చేయవచ్చు. మీ సంతానం పెరిగిన తరువాత ఏం కావాలని మీరు అనుకుంటారో అదే విధంగా మీరు తయారు చేయవచ్చు.
ఒకప్పటి విశ్వాసం ఇప్పుడు వాస్తవంగా మారింది. మామూలు ప్రజలు నమ్ముతున్నదేం కాదు. ఇది డాక్టర్లు నమ్ముతున్న నిజం. నిరూపిస్తున్న నిజం. మీ గర్భంలో పెరిగే శిశువు మీరు కోరుకున్నట్లుగా ఎదుగుతుంది. ఇందులో సందేహం లేదు.
ప్రతి తల్లీ తనకు పుట్టబోయే బిడ్డ మంచి వ్యక్తిగా ఎదగాలని.. ఉన్నతస్థానాలను చేరుకోవాలని, తమకు కీర్తిప్రతిష్ఠలు తేవాలని కోరుకుంటుంది. కానీ, బిడ్డ పుట్టిన తరువాత ఎంత జాగ్రత్తగా పెంచినా, ఎలా ఎదుగుతుందో… ఎలాంటి వ్యక్తిత్వాన్ని పుణికిపుచ్చుకుంటుందో తెలియదు.. కానీ, ఇప్పుడా భయం అక్కర్లేదు.. మీరు ఎలా కోరుకుంటే మీ బిడ్డ అలా తయారవుతుంది.
గర్భజ్ఞానం.. ఎలా సాధ్యం? గర్భంలో శిశువు ఎదుగుతున్నప్పుడే అతని వినికిడి శక్తి వచ్చేస్తుంది. రుచి తెలుస్తుంది..స్పర్శ తెలుస్తుంది. కదలికలు తెలుస్తుంది. ఇంతకాలం తల్లికే ఈ విషయం తెలియకుండా పోయింది. ఇప్పుడిప్పుడే వైద్యులు గుర్తించారు, తల్లులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు, శిశువుకి గర్భమే తొలి పాఠశాల అని.. …
గర్భంలో ఉన్నప్పుడు శిశువుకు వినికిడి శక్తి లాంటివి ఎలా కలుగుతాయి. గర్భంలో ఉన్నప్పుడు బయట జరుగుతున్న అంశాలను వినికిడి శక్తితోనే గ్రాస్ప్ చేసుకునే అవకాశాలుంటాయా? ఇదెలా సాధ్యం? కడుపులో ఉన్న బిడ్డకు బయటి నుంచి చెప్పే విషయాలు వినిపించినప్పటికీ.. అర్థం చేసుకునే శక్తి ఉంటుందా? అసలు గర్భంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ప్రెగెన్సీ సమయంలో శిశువు ఏయే దశల్లో ఏ విధంగా పెరుగుతుంది? గర్భవతికి ఈ విషయాల గురించి ఏమీ తెలియదు. గైనకాలజిస్టు దగ్గరకు వెళ్లటం, ఆమె చెప్పిన మందులు వాడటం తప్ప.. శిశువు ఎలా పెరుగుతోంది.. శిశువు మానసిక, శారీరక ఎదుగుదల స్థాయిలను ఏ విధంగా పెంచాలి? తొమ్మిది మాసాల్లో ఎలాంటి శ్రద్ధ వహించాలి? ఇది పెద్ద సమస్య.. ఈ ఒక్క అడ్డంకిని అధిగమిస్తే చాలు.. తన బిడ్డను పొత్తిళ్లలోకి రాకముందే నియంత్రణలోకీ తీసుకురావచ్చు.
కడుపులో బిడ్డ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనే ద్రవంలో పెరుగుతుంది. తొమ్మిదినెలల పాటు ఈ ద్రవంలోనే బిడ్డ ఎదుగుతుంది. ఈ ద్రవమే శిశువును రక్షిస్తుంది. ఈ ద్రవం ప్రధానంగా తల్లి నుంచి సరఫరా అయ్యే నీటితో ఏర్పడుతుంది. ఇందులో ఉన్న పోషకాహార విలువలు, హార్మోన్లు.. రకరకాల రోగాల నుంచి కాపాడే యాంటీ బాడీలను కలిగి ఉంటుంది.
ఈ హార్మోన్లు గర్భంలో ఉన్న బిడ్డకు ఐక్యు పెంచటానికి చాలా ఉపయోగపడుతుంది. దాదాపు పదిహేను శాతం అయినా ఐక్యుపై ఈ హార్మోన్ ప్రభావం చూపుతుంది. దీని ప్రభావం ఎలా ఉంటుందనేది బిడ్డ ఎదుగుతున్న తీరుతెన్నులను బట్టి తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు.
సాధారణంగా ఎనిమిది వారాలు అయిన తరువాత మొట్టమొదట స్పర్శజ్ఞానం కలుగుతుంది. వాసన చూసే శక్తి కలుగుతుంది. నొప్పిని గుర్తించటం.. మొదలవుతుంది. కదలికలు ప్రారంభమవుతాయి.
13 నుంచి 15 వారాల లోపు రుచిని ఆస్వాదించటం ప్రారంభమవుతుంది. తల్లి తీసుకునే ఆహారంలోని కొంత భాగం శిశువు స్వీకరిస్తుంది. ఇందులో పోషకగుణాలున్న పదార్థాలు శిశువును శక్తిమంతం చేస్తాయి.
గర్భంలో శిశువు ఒక్కో దశలో ఒక్కో రకంగా ఎదుగుతుంది.. వినికిడి శక్తి రావచ్చు.. కానీ, దాని వల్ల గర్భంలోనే ఊహ అనేది ఏర్పడుతుందా? ఆలోచన అనేది మొదలవుతుందా? ఈ ప్రశ్నకు జవాబు డాక్టర్లు అవునని చెప్తున్నారు.. ఈ ఆలోచనే.. ఈ ఊహే.. మీ బిడ్డల్ని సంపూర్ణ వ్యక్తిత్వం పుణికి పుచ్చుకునేందుకు హెల్ప్ చేస్తుంది.
శిశువు గర్భంలో ఎదుగుతున్న క్రమంలో 15వారాల తరువాత నాలుక ఏర్పడుతుంది. తల్లి నుంచి వచ్చే ఆహారాన్ని శిశువు నాలుక ద్వారా లోపలికి తీసుకోవటం.. బయటకు కూడా వదిలేయటం మొదలు పెడుతుంది. ఇది తనంత తానుగా శిశువు పరిణామ క్రమంలో ఎదిగే తీరు…
ఇక్కడే అసలైన పరిణామ దశ మొదలవుతుంది. శిశువు శరీరానికి సంబంధించి దాదాపు 120 గ్రంథులను గుర్తించటం ప్రారంభిస్తుంది. 24వ వారానికి వచ్చేసరికి కంటి చూపు ఏర్పడుతుంది. తనపైన ప్రసరించే కాంతి పుంజాలను గుర్తిస్తుంది. 34వ వారానికి వచ్చేసరికి పూర్తిగా మనలాగే కంటిచూపు ఏర్పడుతుంది.
అయితే వినికిడి శక్తి ఎప్పుడు మొదలవుతుంది.. ఇదీ అసలు ప్రశ్న.. 18వ వారం నుంచే శిశువు చిన్న చిన్న శబ్దాలకు ప్రతిక్రియ వ్యక్తం చేయటం స్టార్ట్ చేస్తుంది. శిశువు చెవిలోపలి భాగాలు వికసిస్తాయి. బయటి శబ్దాలను కూడా గుర్తించటం చిన్నగా మొదలు పెడుతుంది.
శబ్దాలను వినటం ప్రారంభించినప్పటి నుంచీ దానికి స్పందించటం కూడా శిశువు మొదలు పెడుతుంది. గ్రాహక సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ.. ఈ ప్రతిస్పందనలు ఉంటాయి.
మహాభారత కాలంలో శ్రీకృష్ణుడిది మాయో మర్మమో అనుకున్నాం.. కానీ, ఇది నిజం.. గర్భంలో ఉన్న శిశువు మరో అభిమన్యుడుగా తయారు కావచ్చు. ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడే చదువు నేర్పవచ్చు.. ఇంతకాలం మనకు తెలియని విషయం.. మన ఇతిహాసాలను మనం నమ్మలేని పరిస్థితి.. వాటిలో చెప్పినవన్నింటినీ కొట్టిపారేసే వాతావరణం… కానీ, ఇప్పుడు సైన్స్ కూడా ఈ విషయాన్ని తేల్చి చెప్పింది.
2011 నాటి మాట మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కారు నడుపుకొంటూ ఓ అమ్మాయి ఝామ్మని వెళ్తోంది.. ఆమె ఆరుమాసాల గర్భవతి. మ్యూజిక్ వింటూ సరదాగా నడుపుతోంది.. ఇక్కడే ఉంది ట్విస్ట్.. ఈ మ్యూజిక్‌తో అమ్మ ఎంత ఎంజాయ్ చేస్తోందో ఆమె కడుపులోని శిశువూ ఎంజాయ్ చేస్తోంది. ఇది నిజంగా జరిగిన వాస్తవం. 20వ వారం నుంచి శిశువు విస్పష్టంగా వినగలుగుతుంది. వంటింట్లో గ్రైండర్ శబ్దాలను కడుపులో ఉన్నప్పుడే శిశువు వినగలుగుతోంది.
శిశువు విన్నప్పుడు దాని వెనుక మంచి చెడులేమిటని గ్రహించే సామర్థ్యం రాకపోవచ్చు. కానీ, తనకు వినిపించిన ప్రతి మాటా.. ప్రతి శబ్దం శిశువు మేధలో నిక్షిప్తమవుతుంది. పశువు మేత మేసిన తరువాత కొంత సమయం తీసుకుని నెమరు వేసుకుంటుందో.. గర్భంలో శిశువు కూడా మనం బయటి నుంచి చెప్పే ప్రతి మాటకూ ఊ కొడుతుంది.. మెదడు దాన్ని గ్రాస్ప్ చేసుకుంటుంది. జన్మించిన తరువాత క్రమ పద్ధతిలో ఎదుగుతున్న కొద్దీ, జన్మించటానికి ముందు నిక్షిప్తమైన సమాచారం కొంత కొంతగా వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుంది..
గర్భంలో శిశువు ఎదుగుదల పరిణామ క్రమంలో జరిగే వ్యవహారం తల్లులకు కానీ, తండ్రులకు కానీ ఎంతమాత్రం తెలియదు.. ఇప్పుడు దీనిపై అవగాహన కల్పించే కార్యక్రమమూ మొదలైంది. గుజరాత్‌లోని సూరత్ లో డాక్టర్ నీలేశ్ పటేల్ ఒక ప్రత్యేక పద్ధతిలో గర్భవతులకు కోర్సు నిర్వహిస్తున్నారు.. యోగా, ప్రాణాయామంతో పాటు ఇతర పద్ధతుల్లో తల్లులకు తమ పిల్లలకు ఎలా ఎదిగేలా చేయాలో అవగాహన కల్పిస్తున్నారు.
శిశువుకు తల్లి తొలి గురువు. శిశువుకు గర్భం తొలి పాఠశాల. మరి మీరూ ప్రయత్నించండి.. మీ శిశువును గర్భంలోనే అభిమన్యుడిగా తయారు చేయండి… ఇప్పుడు మీ శిశువుల వ్యక్తిత్వం మీ చేతుల్లో ఉంది… మరి మీరేం చేయబోతున్నారు…?మీకు గుర్తుందా? అభిమన్యుడు.. మహాభారతంలో అర్జునుడి కుమారుడు. సుభద్రాదేవి కడుపులో ఉండగానే యుద్ధంలో పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలో తెలుసుకున్నాడట. ఇప్పుడు మీ గర్భంలో శిశువు మరో అభిమన్యుడవుతున్నాడు.. మీ ఇంట్లో అడుగుపెడుతున్నాడు.. పద్మవ్యూహం లాంటి ప్రపంచాన్ని మీ కడుపులో ఉండగానే.. మీ కళ్లతోనే, మీ మాటలతోనే అర్థం చేసుకుంటున్నాడు..మీరు చెప్పింది విని అర్థం చేసుకోగలుగుతున్నాడు.
కురుక్షేత్రంలో ఒకే ఒక్కరోజు అత్యంత కీలకమైన యుద్ధ వ్యూహాన్ని చిన్న కుర్రాడు అభిమన్యుడు ఛేదించటం గొప్ప సన్నివేశం.. ఇంతకీ ఈ పద్మవ్యూహాన్ని ఎప్పుడు నేర్చుకున్నాడో తెలుసా? తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే శ్రీకృష్ణుడు వచ్చి నేర్పాడట..
ఇప్పుడు మీ గర్భంలో ఉన్న శిశువుకు కూడా పద్మవ్యూహం లాంటి ప్రపంచాన్ని చూపించవచ్చు. మీరు కోరుకున్నట్లుగా మీకు పుట్టబోయే శిశువు పెరుగుతుంది. చదువు చెప్పవచ్చు.. సంస్కారం చెప్పవచ్చు..వ్యక్తిత్వాన్ని ముందే డిసైడ్ చేయవచ్చు. మీ సంతానం పెరిగిన తరువాత ఏం కావాలని మీరు అనుకుంటారో అదే విధంగా మీరు తయారు చేయవచ్చు.
ఒకప్పటి విశ్వాసం ఇప్పుడు వాస్తవంగా మారింది. మామూలు ప్రజలు నమ్ముతున్నదేం కాదు. ఇది డాక్టర్లు నమ్ముతున్న నిజం. నిరూపిస్తున్న నిజం. మీ గర్భంలో పెరిగే శిశువు మీరు కోరుకున్నట్లుగా ఎదుగుతుంది. ఇందులో సందేహం లేదు.
ప్రతి తల్లీ తనకు పుట్టబోయే బిడ్డ మంచి వ్యక్తిగా ఎదగాలని.. ఉన్నతస్థానాలను చేరుకోవాలని, తమకు కీర్తిప్రతిష్ఠలు తేవాలని కోరుకుంటుంది. కానీ, బిడ్డ పుట్టిన తరువాత ఎంత జాగ్రత్తగా పెంచినా, ఎలా ఎదుగుతుందో… ఎలాంటి వ్యక్తిత్వాన్ని పుణికిపుచ్చుకుంటుందో తెలియదు.. కానీ, ఇప్పుడా భయం అక్కర్లేదు.. మీరు ఎలా కోరుకుంటే మీ బిడ్డ అలా తయారవుతుంది.
గర్భజ్ఞానం.. ఎలా సాధ్యం? గర్భంలో శిశువు ఎదుగుతున్నప్పుడే అతని వినికిడి శక్తి వచ్చేస్తుంది. రుచి తెలుస్తుంది..స్పర్శ తెలుస్తుంది. కదలికలు తెలుస్తుంది. ఇంతకాలం తల్లికే ఈ విషయం తెలియకుండా పోయింది. ఇప్పుడిప్పుడే వైద్యులు గుర్తించారు, తల్లులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు, శిశువుకి గర్భమే తొలి పాఠశాల అని.. …
గర్భంలో ఉన్నప్పుడు శిశువుకు వినికిడి శక్తి లాంటివి ఎలా కలుగుతాయి. గర్భంలో ఉన్నప్పుడు బయట జరుగుతున్న అంశాలను వినికిడి శక్తితోనే గ్రాస్ప్ చేసుకునే అవకాశాలుంటాయా? ఇదెలా సాధ్యం? కడుపులో ఉన్న బిడ్డకు బయటి నుంచి చెప్పే విషయాలు వినిపించినప్పటికీ.. అర్థం చేసుకునే శక్తి ఉంటుందా? అసలు గర్భంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ప్రెగెన్సీ సమయంలో శిశువు ఏయే దశల్లో ఏ విధంగా పెరుగుతుంది? గర్భవతికి ఈ విషయాల గురించి ఏమీ తెలియదు. గైనకాలజిస్టు దగ్గరకు వెళ్లటం, ఆమె చెప్పిన మందులు వాడటం తప్ప.. శిశువు ఎలా పెరుగుతోంది.. శిశువు మానసిక, శారీరక ఎదుగుదల స్థాయిలను ఏ విధంగా పెంచాలి? తొమ్మిది మాసాల్లో ఎలాంటి శ్రద్ధ వహించాలి? ఇది పెద్ద సమస్య.. ఈ ఒక్క అడ్డంకిని అధిగమిస్తే చాలు.. తన బిడ్డను పొత్తిళ్లలోకి రాకముందే నియంత్రణలోకీ తీసుకురావచ్చు.
కడుపులో బిడ్డ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనే ద్రవంలో పెరుగుతుంది. తొమ్మిదినెలల పాటు ఈ ద్రవంలోనే బిడ్డ ఎదుగుతుంది. ఈ ద్రవమే శిశువును రక్షిస్తుంది. ఈ ద్రవం ప్రధానంగా తల్లి నుంచి సరఫరా అయ్యే నీటితో ఏర్పడుతుంది. ఇందులో ఉన్న పోషకాహార విలువలు, హార్మోన్లు.. రకరకాల రోగాల నుంచి కాపాడే యాంటీ బాడీలను కలిగి ఉంటుంది.
ఈ హార్మోన్లు గర్భంలో ఉన్న బిడ్డకు ఐక్యు పెంచటానికి చాలా ఉపయోగపడుతుంది. దాదాపు పదిహేను శాతం అయినా ఐక్యుపై ఈ హార్మోన్ ప్రభావం చూపుతుంది. దీని ప్రభావం ఎలా ఉంటుందనేది బిడ్డ ఎదుగుతున్న తీరుతెన్నులను బట్టి తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు.
సాధారణంగా ఎనిమిది వారాలు అయిన తరువాత మొట్టమొదట స్పర్శజ్ఞానం కలుగుతుంది. వాసన చూసే శక్తి కలుగుతుంది. నొప్పిని గుర్తించటం.. మొదలవుతుంది. కదలికలు ప్రారంభమవుతాయి.
13 నుంచి 15 వారాల లోపు రుచిని ఆస్వాదించటం ప్రారంభమవుతుంది. తల్లి తీసుకునే ఆహారంలోని కొంత భాగం శిశువు స్వీకరిస్తుంది. ఇందులో పోషకగుణాలున్న పదార్థాలు శిశువును శక్తిమంతం చేస్తాయి.
గర్భంలో శిశువు ఒక్కో దశలో ఒక్కో రకంగా ఎదుగుతుంది.. వినికిడి శక్తి రావచ్చు.. కానీ, దాని వల్ల గర్భంలోనే ఊహ అనేది ఏర్పడుతుందా? ఆలోచన అనేది మొదలవుతుందా? ఈ ప్రశ్నకు జవాబు డాక్టర్లు అవునని చెప్తున్నారు.. ఈ ఆలోచనే.. ఈ ఊహే.. మీ బిడ్డల్ని సంపూర్ణ వ్యక్తిత్వం పుణికి పుచ్చుకునేందుకు హెల్ప్ చేస్తుంది.
శిశువు గర్భంలో ఎదుగుతున్న క్రమంలో 15వారాల తరువాత నాలుక ఏర్పడుతుంది. తల్లి నుంచి వచ్చే ఆహారాన్ని శిశువు నాలుక ద్వారా లోపలికి తీసుకోవటం.. బయటకు కూడా వదిలేయటం మొదలు పెడుతుంది. ఇది తనంత తానుగా శిశువు పరిణామ క్రమంలో ఎదిగే తీరు…
ఇక్కడే అసలైన పరిణామ దశ మొదలవుతుంది. శిశువు శరీరానికి సంబంధించి దాదాపు 120 గ్రంథులను గుర్తించటం ప్రారంభిస్తుంది. 24వ వారానికి వచ్చేసరికి కంటి చూపు ఏర్పడుతుంది. తనపైన ప్రసరించే కాంతి పుంజాలను గుర్తిస్తుంది. 34వ వారానికి వచ్చేసరికి పూర్తిగా మనలాగే కంటిచూపు ఏర్పడుతుంది.
అయితే వినికిడి శక్తి ఎప్పుడు మొదలవుతుంది.. ఇదీ అసలు ప్రశ్న.. 18వ వారం నుంచే శిశువు చిన్న చిన్న శబ్దాలకు ప్రతిక్రియ వ్యక్తం చేయటం స్టార్ట్ చేస్తుంది. శిశువు చెవిలోపలి భాగాలు వికసిస్తాయి. బయటి శబ్దాలను కూడా గుర్తించటం చిన్నగా మొదలు పెడుతుంది.
శబ్దాలను వినటం ప్రారంభించినప్పటి నుంచీ దానికి స్పందించటం కూడా శిశువు మొదలు పెడుతుంది. గ్రాహక సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ.. ఈ ప్రతిస్పందనలు ఉంటాయి.
మహాభారత కాలంలో శ్రీకృష్ణుడిది మాయో మర్మమో అనుకున్నాం.. కానీ, ఇది నిజం.. గర్భంలో ఉన్న శిశువు మరో అభిమన్యుడుగా తయారు కావచ్చు. ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడే చదువు నేర్పవచ్చు.. ఇంతకాలం మనకు తెలియని విషయం.. మన ఇతిహాసాలను మనం నమ్మలేని పరిస్థితి.. వాటిలో చెప్పినవన్నింటినీ కొట్టిపారేసే వాతావరణం… కానీ, ఇప్పుడు సైన్స్ కూడా ఈ విషయాన్ని తేల్చి చెప్పింది.
2011 నాటి మాట మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కారు నడుపుకొంటూ ఓ అమ్మాయి ఝామ్మని వెళ్తోంది.. ఆమె ఆరుమాసాల గర్భవతి. మ్యూజిక్ వింటూ సరదాగా నడుపుతోంది.. ఇక్కడే ఉంది ట్విస్ట్.. ఈ మ్యూజిక్‌తో అమ్మ ఎంత ఎంజాయ్ చేస్తోందో ఆమె కడుపులోని శిశువూ ఎంజాయ్ చేస్తోంది. ఇది నిజంగా జరిగిన వాస్తవం. 20వ వారం నుంచి శిశువు విస్పష్టంగా వినగలుగుతుంది. వంటింట్లో గ్రైండర్ శబ్దాలను కడుపులో ఉన్నప్పుడే శిశువు వినగలుగుతోంది.
శిశువు విన్నప్పుడు దాని వెనుక మంచి చెడులేమిటని గ్రహించే సామర్థ్యం రాకపోవచ్చు. కానీ, తనకు వినిపించిన ప్రతి మాటా.. ప్రతి శబ్దం శిశువు మేధలో నిక్షిప్తమవుతుంది. పశువు మేత మేసిన తరువాత కొంత సమయం తీసుకుని నెమరు వేసుకుంటుందో.. గర్భంలో శిశువు కూడా మనం బయటి నుంచి చెప్పే ప్రతి మాటకూ ఊ కొడుతుంది.. మెదడు దాన్ని గ్రాస్ప్ చేసుకుంటుంది. జన్మించిన తరువాత క్రమ పద్ధతిలో ఎదుగుతున్న కొద్దీ, జన్మించటానికి ముందు నిక్షిప్తమైన సమాచారం కొంత కొంతగా వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుంది..
గర్భంలో శిశువు ఎదుగుదల పరిణామ క్రమంలో జరిగే వ్యవహారం తల్లులకు కానీ, తండ్రులకు కానీ ఎంతమాత్రం తెలియదు.. ఇప్పుడు దీనిపై అవగాహన కల్పించే కార్యక్రమమూ మొదలైంది. గుజరాత్‌లోని సూరత్ లో డాక్టర్ నీలేశ్ పటేల్ ఒక ప్రత్యేక పద్ధతిలో గర్భవతులకు కోర్సు నిర్వహిస్తున్నారు.. యోగా, ప్రాణాయామంతో పాటు ఇతర పద్ధతుల్లో తల్లులకు తమ పిల్లలకు ఎలా ఎదిగేలా చేయాలో అవగాహన కల్పిస్తున్నారు.
శిశువుకు తల్లి తొలి గురువు. శిశువుకు గర్భం తొలి పాఠశాల. మరి మీరూ ప్రయత్నించండి.. మీ శిశువును గర్భంలోనే అభిమన్యుడిగా తయారు చేయండి… ఇప్పుడు మీ శిశువుల వ్యక్తిత్వం మీ చేతుల్లో ఉంది… మరి మీరేం చేయబోతున్నారు…?

Reviews

There are no reviews yet.

Be the first to review “మీ గర్భంలోనూ అభిమన్యుడు!
కోవెల సంతోష్ కుమార్”

Your email address will not be published. Required fields are marked *