తెలంగాణా పత్రికలు- పుస్తక సమీక్ష

Category:

తెలంగాణా సంస్కృతి వికాసం, సాహిత్య పరిణామం ఎదిగే దశలో ఇటీవల ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ప్రయత్నంలో భాగమే తెలంగాణా పత్రికలు అనే ఈ పుస్తకం. కాకతీయుల తరువాత తెలుగువారి జీవనం పతనమైంది. మధ్య మధ్య పునరుద్ధరణ ప్రయత్నాలెన్ని జరిగినా తెలంగాణా అంతా పర పరిపాలకుల ఒత్తిడిలోనే మగ్గిపోయింది. తెలుగు భాషాసంస్కృతులు రాజ్యాదరణకు నోచుకోలేదు. పైగా ప్రతీకార బుద్ధితో అణచివేయబడ్డాయి. నిజాం పరిపాలనాకాలంలో ఈ న్థితి మరీ గడ్డుగా మారిపోయింది.
ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ వారి పరిపాలన కొనసాగినా, వారి ఉదారవాద, ప్రజాస్వామ్య ధోరణులు సంస్కృతి వికాసానికి, పాశ్చాత్య వాసన ప్రభావం చేత ఆధునికం కావటానికీ దోహదం చేశాయి. పత్రికలు, సాహిత్యం, నూతన దిశను వెతుక్కున్నాయి. తెలంగాణాలో అణచివేేన రాజు, అతనికి తోడైన అధికారులూ ఉర్దూ, పారశీక, అరబ్బీ భాషలకు పట్టం కట్టి దేశ భాషలను వెలివేశారు. విద్యావ్యాప్తినీ చాలా పరిమితం చేశారు.
అలాంటి న్థితిలో భాషా సాహిత్యాలు రక్షించుకునే బాధ్యత సామాన్య ప్రజల మీద పడ్డది. రచయితలు, తమ రచనలను ఈశ్వరాంకితంగా కొనసాగించారు. మార్గ, దేశి కవితల సమన్వయం నిద్ధించింది. ఇక్కడి ప్రబంధాల్లో దేశీయ రచనలు చోటు చేసుకున్నాయి. భాష, అన్యభాషా సంపర్కం నుంచి చాలా వరకు రక్షింపబడింది.
గ్రంథాలయాలు, పత్రికలే ఇక్కడ విద్యాస్థానాలు. శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయంతో పాటు, వందలాది గ్రంథాలయాలు భాషా సాహిత్యాలకు కంచుకోటలయ్యాయి. ఆనాళ్లలో పత్రికలు స్థాపించ తలిేన్త, ‘నేను రాజకీయాల గురించి రాయనని’ ముందుగానే ప్రభుత్వానికి హామీ ఇవ్వాలి. తెలుగు ప్రెస్సులు కూడా ఉండేవి కావు. తెలుగులో పత్రికలు 1912 దాకా రాలేదనే చెప్పాలి. పాలమూరు నుంచి ‘హితబోధిని’ పత్రిక వచ్చింది. ఇనుగుర్తి నుంచి ‘తెనుగు పత్రిక’ నల్లగొండ నుంచి నీలగిరి వచ్చాయి. ఆంధ్రాభ్యుదయం, శైవ ప్రచారిణి, విభూతి, దివ్యవాణి, శోభ… ఇలా ఎన్నో పత్రికలు తరువాత క్రమంలో వచ్చాయి.
బాలశ్రీనివాసమూర్తి చాలా పరిశ్రమించి అనేక పత్రికల వికాసాల్ని, వాటి పరిమితులను అవి సాహిత్యానికి చేనిన ేనవలను వివరించారు. ఈ కృషి నిస్సందేహంగా అభినందించతగింది. తెనుగు పత్రికలో పేర్కొన్న ఆనాటి గ్రంథాలయాల వివరాలను కూడా ఇందులో తెలియజేశారు. 56, 57 పేజీలలో పేర్కొన్న 35 గ్రంథాలయాల వివరాలు అమూల్యమైనవి. నాడు పత్రికలో రచయిత వివరాలను ఇచ్చేవారు. పరిశోధకులు ేనకరించిన తాళపత్ర గ్రంథాల వివరాలను ఇచ్చేవారు. సాహిత్య సాంస్కృతిక సభా వృత్తాంతాలు ఉండేవి. సాంఘిక సంస్కరణల విశేషాలు ఉండేవి. వీటన్నింటిని గురించిన సమాచారం ఇచ్చి చరిత్ర నిర్మాణానికి ఈ రచయిత గొప్ప ఉపకారం చేశారు.

Reviews

There are no reviews yet.

Be the first to review “తెలంగాణా పత్రికలు- పుస్తక సమీక్ష”

Your email address will not be published. Required fields are marked *