చిల్లర దేవుళ్ళు
జ్వలిత

Category:

తెలంగాణ ‘చావ’ గల గడ్డ అని చెప్పేందుకు నిలువెత్తు సాక్ష్యులు దాశరథి సోదరులు. ఇద్దరూ తెలంగాణా సాహిత్య చరిత్రను సుసంపన్నం చేసినవారే. దాశరథి సోదరులుగా గణుతికెక్కిన దాశరథి కృష్ణమాచార్య పద్యంతో, దాశరథి రంగాచార్య గద్యంతో సాహిత్య వ్యవసాయం చేశారు. ఇంట్లో సంస్కృతం తప్ప మరో భాషకు తావులేని ఛాందస కుటుంబంలో పుట్టినా వామపక్ష భావజాలానికి ప్రభావితులైనారు. నిజాం వ్యతిరేక పోరాటంలో పా్గని నిర్భందాలు అనుభవించారు.
దాశరథి రంగాచార్య వరంగల్ జిల్లా చినగూడూరు గ్రామంలో 1928 ఆగష్టూ 24వ తేదీన వెంకటాచార్య వెంకటమ్మ దంపతులకు రెండో సంతానంగా జన్మించారు. పుట్టింది వరంగల్ జిల్లా అయినప్పటికి ఖమ్మం జిల్లా గార్లలో వారి నివాసం ఏర్పరుచుకున్నారు. ఛాందస భావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కొడుకుల వైఖరికి విముఖుతతో తండ్రి కుటుంబం వదలి వెళ్ళటంతో కుటుంబ భారం అంటే తల్లీ ముగ్గురు చెల్లెళ్ళ తల్లి బాధ్యత ఇద్దరు సోదరులపై పడింది. విద్యార్థిగానే నిజాం వ్యతిరేక పోరాటంలో భాగస్వామియై కృష్ణమాచార్య జైలు పాలయిన తరువాత, రంగాచార్య ఒక్కడే కుటుంబానికి దిక్కుగా మిగిలాడు. తల్లితో కలిసి చిన్న చిన్న పనుల ద్వారా ఆదాయం కల్పించుకునే క్రమంలో అన్ని వర్గాల ప్రజలతో మమేకమయిన రంగాచార్యకు సమాజం యొక్క అన్ని కోణాలను అతి దగ్గరగా పరిశీలించే అవకాశం లభించింది. ఆ పరిశీలన ప్రతిస్పందనగా వారి నవలల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
నాటి నిజాం నవాబు పాఠశాల విద్యార్థులపై కూడా తన హుకుం చెలాయించేందుకు కుచ్చు టోపీలను ప్రవేశపెట్టగా గాంధీ టోపీ ధరిస్తామని విద్యార్థులను సమకట్టినందుకు బహిష్కరణకు గురయ్యారు. ఆరవ తరగతిలోనే చదువు ఆగిపోయింది. ఆ సమయంలో అందరిలాగే వామపక్ష భావజాలానికి లోనయి విప్లవ సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేశారు.
పాఠశాలల్లో ఉర్దూ తప్ప తెలుగుకు స్థానం లేకపోవడం రంగాచార్యను తెలుగుపై మమకారాన్ని పెంచింది. తాను పుట్టిన వర్గ నేపథ్యం కారణంగా భారత రామాయణాలు, వేదాలు ఉపనిషత్తులపై పట్టుకు ఆసక్తితో పాటు అవకాశం కలిగింది.
జీవితానుభవాలు కుటుంబ నేపథ్యం వచన సాహిత్యానికి ఆయనకు చక్కని శైలి కల్పించింది. 1948 తరువాత ప్రజలను పీడించిన దొరలె గాంధీ టోపితో రాజకీయ నాయకులుగా ఎదగడం సరిపడని రంగాచార్య స్వయంకృషితో చదువుకొని 1951లో ఉపాధ్యాయవృత్తిలో చేరారు.
వట్టికోట ఆళ్వారుస్వామి వదిలి వెళ్ళిన వారసత్వాన్ని తనదైన పద్ధతిలో రంగాచార్య తెలంగాణ ప్రజా జీవన చిత్రణ కోసం సాహిత్య రచనకు సిద్ధమయ్యారు. ప్రణాళికాబద్దంగా అధ్యయనం చేసి నవలా రచనను ప్రారంభించారు.
1969లో మొదటి నవల ‘‘చిల్లరదేవుళ్ళు’’ పేరుతో తెలంగాణ మాండలికంలో నాటి భూస్వామ్య వ్యవస్థను, వెట్టి, పాలక వర్గాలు నిజాం అనుచరుల ఆగడాలను వివరించారు. ఇది 1937, 38 నాటి గ్రామ జీవితానికి అద్దం పట్టింది.
పాలకులు దైవాంశ సంభూతునే భూస్వామ్య సిద్ధాంతాన్ని పాలకులేకాక పాలితులు కూడా నమ్మిన విధాన్ని చిత్రీకరించారు ‘‘చిల్లరదేవుళ్ళు’’ నవలలో.
‘‘చిల్లరదేవుళ్ళు’’ కథలో కథానాయకుడు సారంగపాణి ఒక బలహీన పాత్ర, సంగీత పండితునిగా నైపుణ్యమున్నది కాని, కథా నాయకునికి వుండవలసిన ధీరత్వం, ఉద్యమ వ్యూహం తిరగబడే గుణం, ముఖ్యంగా సంఘటనలకు స్పందించగల తత్వం వర్ణించబడలేదు. కాని అవసరమయిన చోట సలహా నివ్వగల చతురత, పౌరుషానికి పోయి సమస్యలు తెచ్చుకొనే ప్రమాదగుణం లేదు పాణికి.
పాణి పాత్ర ప్రవేశమే అతి దయనీయం పాండిత్యానికి, ప్రావీణ్యతకు కాక అధికార అహంకారానికి మాత్రమే ప్రతిరూపమయిన రామారెడ్డి వద్దకు వచ్చి మూడుసార్లు నమస్కరించినా చూచి చూడనట్లే నటించాడు రెడ్డిగారు. పాణి అలసి ఉన్నాడు. ఆదరణ కోసం తపిస్తున్నాడు. మరొకసారి నమస్కరించాడు. రెడ్డిగారు చూడలేదు. ఒకింత చిరాకుపడ్డాడు పాణి. ద్ణుఖంతో ఆవేశంలో గొంతు పూడుకుపోయింది. ‘‘ఎంతో దూరం నుంచి వచ్చిన శ్రమ వృధా అవుతుందేవెూ. రెడిె్డకంత గర్వమేం. వెూలిన్ కూడా పట్టుకొని సాక్షాత్తు సంగీతం రూపంలో తాను అవతరిస్తే కనీసం పలకరించడే. అంతకన్న అవమానం ఏం జరగాలి. వెళ్ళి పోదామనుకున్నాడు’’ కాని పోలేక కండువాతో ముఖం తుడుచుకొని చేతులు కట్టుకొని నించున్నాడు.
నవలలో సారంగపాణి పరిచయంతోనే ఆ పాత్ర వ్యక్తిత్వం అర్థం అవుతుంది. మల్లిగాడు చెప్పింది నిజమేనా అని ఆలోచించబోయి తనెకందుకులే అని ఊరుకుంటాడు పాణి.
ా చింతకాయలు దొంగిలించిన పీరిగాడు దొరకు దొరక్కుండ పారిపోవడం, నిలవమన్నా ఉరకడం, రెడ్డి అధికారం భంగం కలిగినట్టు బాధపడతాడు. ఆ సంగతే పాణితో చెప్పాడు. ‘‘చింతకాయలు చిన్న విషయం దీనికోసం చిక్కుల్లో ఇరుక్కోవడం మంచిదికాదని అంటాడు పాణి.
‘‘లోకంలో మేలుకోరి నిష్ఠూరం అయినా శ్రేయస్సు కొరకు మాట చెప్పేవారు అరుదు’’ అని చెప్పాడు.
ా వనజను వివాహం చేసుకోమన్నపుడు కూడా ధైర్యంగా చేసుకోలేను అని’’ చెప్పాడు. రెడ్డి చేత చెంప దెబ్బతింటాడు. వనజను బెత్తంతో కొడ్తుంటే అడ్డుపోయి రెడ్డి చేతిలో దెబ్బలు తింటాడు. చివరకు రెడ్డి చేత వెళ్ళిపొమ్మని చెప్పించుకొని ఊరువిడిచి వెళ్తూ కూడా కరణం కూతురు తాయారుకు కరణానికి చెప్పి, కోమిటి నారయ్య యింటికి పోయి అతని బిడ్డ సీతకు ఫిడేలును బహుమానంగా యిచ్చి వెళ్ళిపోతాడు. పాణి పాత్ర చిత్రణ ద్వారా కళలు తెలిసిన వారు నలుగురితో సత్సంబంధాలు కలిగి ఉండటం ద్వారా సమాజానికి ఉపెూగపడాలని పరోక్షంగా చెప్పాడు రచయిత.
ా సారంగపాణి హైదరాబాదు వచ్చి మాడపాటి వారిని కలిసి చర్చించినట్లుగా చెప్పిన అంశాలు తెలుగు మాట్లాడే వారంతా ఒకే సంతతికి చెందిన వారు. వారి ఆహార వ్యవహారాలు, నాగరికత, సంస్కృతి, స్వభావం అన్నీ ఒక లాంటివే. రాజకీయ కారణాల వల్ల తెలంగాణ తెలుగువారు చీలిపోయారు. తెలంగాణ వారిని 600 సంవత్సరాల నుండి తురుష్కూలు పరిపాలిస్తున్నారు. రెండవ ప్రతాపరుద్రుని తరువాత హిందు రాజులెవ్వరు పాలించలేదు అంటూ తెలంగాణ భాషపై ఉర్దూ ప్రభావం, మహారాష్ర్ట సరిహద్దుగా ఉన్న నిజామాబాద్ జిల్లా ప్రజలపై మరాఠీ భాషా ప్రభావాన్ని, కర్ణాటక ప్రభావమున్న మహబూబ్‌నగర్ జిల్లా భాషను వివరించారు.
ా తురుష్కూల రాజ్యంలో ఉర్దూను అభివృద్ధి పరచడం వారి లక్ష్యం. 3ా10ా1918 ఉస్మానియా విశ్వ విద్యాలయం ప్రారంభించబడింది. అక్కడ నాల్గవ తరగతి వరకు తెలుగు, ఏడవ తరగతి దాకా తెలుగు రెండవ భాషగా ఉంటుంది. ఆ తరువాత అంతా ఉర్దూలోనే. విద్యావంతులు వెయ్యికి 82 అందులో తురకలో 59 హిందువుల్లో 23 ప్రజాహిత కార్యాల్లో అభివురుచి మహారాష్ర్టులదే.
ా హైదరాబాదును తమనగరమని, తెలుగు తమ మాతృభాషని ఎవరు భావించరు. 1ా9ా1901న రెసిడెన్సీ బజారులో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం స్థాపించబడింది. కారకులు నాయిని వెంకట రంగారావు బహద్దూర్, కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు.
ా 11ా11ా1922 కార్వె పండితుని అధ్యక్షతన నిజాం రాష్ర్ట సంఘ సంస్కార మహాసభ సమావేశమైంది. రాజకీయ లక్ష్యాలేం లేవు. నిజాం రాష్ర్ట రాజకీయాలు విచిత్రమైనవి. పోలీసులు రాక్షసుల్ని తలతన్నిన వారు. 1919లో ఒక రాజ శాసనం ద్వారా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను విస్తరింప చేస్తే అందుకు కృతజ్ఞతగా జరిగిన సభలే మొట్టమొదటి సభలు.
ా రాజకీయ నేరస్తులకు శిక్షగా మహబూబ్‌నగర్ జిల్లా అమరాబాదు కొండ ప్రాంత ‘‘మన్ననూరు’’కు పంపేవారు. ా 1931లో బెరార్‌లోని అకోలాలో సభలు జరిగాయి. 1932లో హిందువులకు జరుగుతున్న అన్యాయంపై కరపత్రాలు వేసారు.
హిందువుల సంఖ్య రాజ్యాంలో తగ్గుతున్న క్రమం.
1901లో హిందువుల శాతం 88.6, 1911లో హిందువుల శాతం 88.9
1921లో హిందువుల శాతం 85.4, 1931లో హిందువుల శాతం 84.0
ా నాటి నిజాం నవాబు 1911లో గద్దె నెక్కాడు. ఉత్తర దేశం నుండి హిందువుల దిగుమతి పెరిగింది. 1931లో సైన్యంలో 51,149, తురకలు 6,495, హిందు ఉద్యోగాఓ్ల 58,188, తురకలు 16,873, హిందు టైమ్స్ ఆఫ్ ఇండియా సంపాదకీయంలో రాసింది,
ా తెలంగాణలో జాగృతి కలిగింది. ఆంధ్రజన సంఘాల నగరంలో ఉపన్యాసాలు, సమావేశాల వల్లనే 1923లో హనుమకొండలో జరిగిన ప్రతినిధుల సభలో ‘‘ఆంధ్రజన కేంద్ర సంఘం’’ స్థాపించబడింది. గ్రంథాలయాలు, పాఠశాలలు, వర్తక సంఘాలు స్థాపించడం లఘు పుస్తకాలు ప్రకటించడం సంఘ లక్ష్యాలు.
ా మొదటి మూడు సభలకు ప్రభుత్వం అనుమతించింది. అవి హైద్రాబాదు, నల్లగండ, మధిరల్లో జరిగాయి. 1925 నాల్గవ వార్షిక సభకు అనుమతి లభించలేదు. 1928లో లెప్టినెంట్ కర్నల్ ట్రెంచ్ అనుమతితో సూర్యపేటలో, 1930లో జోగిపేటలో, 1931లో దేవరకొండలో సభలు జరిగాయి. పై విషయాలను చారిత్రక డాక్యుమెంటరీగా ఈ నవలలో పొందుపరిచారు దాశరథి రంగాచార్యులు. నవలలో నాటి సామాజిక స్థితిగతులను సమగ్ర పరిశీలనతతో పాటు ఆనాటి చారిత్రక వాతావరణం, భౌగోళిక, ఆర్థిక వ్యవస్థల వివరణ వారి మొదటి నవల అయిన ‘‘చిల్లరదేవుళ్ళు’’లో చేశారు.
తెలంగాణ ఆంధ్ర మహాసభ ఆవిర్భావం వరకు అంధకారమయమైన భూస్వామ్య వ్యవస్థ వున్నది ఈ నవలలో.
నాటి నిజాం ప్రభువు అధికార దాహంతో మత మార్పిడి చేపట్టి బడుగు దళిత వర్గాలకు భూమి యిస్తామని ఆశ చూపిస్తారు. భూస్వాములకు వెట్టి చేయ నవసరం లేదని నమ్మిస్తూ గ్రామాలకు గ్రామాలే తురకల్లో కలిపిన విషయాన్ని చక్కగా వివరించారు.
రామారెడ్డి, కరణం సాక్షిగా వారి గ్రామ ప్రజలను మతం మార్చడానికి వచ్చిన బహద్దూర్ యార్‌జంగ్ ఉపన్యసించిన తీరు ఉదాహరణ. ‘‘హిందువులు మాల మాదుగల్ని చాలా నీచంగా చూస్తున్నారు. తమ బావుల దగ్గరికి రానివ్వరు తాకితే మైలపడతామంటారు. అతి నీచమయిన పనులు చేయిస్తారు. ఇస్లాం మతమిచ్చి వారిని ఉద్దరించడానికే ఇత్తేహాదుల్ ముసల్మీన్ వెలసింది నవ ముసల్మానుల సంక్షేమానికి కృషి చేస్తుంది. వారికి భూములు చూపి, బావులు తవ్వించి, విద్య చెప్పించడం వంటి పనులు చేస్తుందంటాడు.
‘‘ప్రపంచంలో ఇస్లాం ఒక్కటే మతమనీ అల్లా ఒక్కడే దేవుడనీ హజ్రత్ మహమ్మద్ ప్రవచించారు. ముసల్మానులో కులాలుండవు. అల్లా దృష్టిలో అందరూ సమానమే. చాటుగా చేయడం లేదు. ఈ పని మీరందరూ సాక్షమని చెప్పి, వారి జుట్టు గొరిగించి వారి మొలతాళ్ళు తెంచి పేర్లుమార్చుతారు, ఇందుకు దళిత పురుషూలు వినయంగా సహకరిస్తారు.
ఆడవాళ్ళ పుస్తెలు తెంపే ప్రక్రియ మొదలు పెట్టే సమయం దళిత స్త్రీలెవ్వరూ అంగీకరించరు. పుస్తెలుంచి తురకల కలపండి అని ధైర్యంగా చెప్తారు. ’ మనెకందుకసే గీ తురకం గిరకం మొగోల్లకు సిగ్గులేక పోయె మనకన్న ఉండొద్దె చస్తె మాల మాదుగులుగనే చద్దాం తను ధైర్యంగా వెనుదిరుగుతారు’’.
ఖాజీ పుస్తెలు తెంపకుంటనే ఇస్లాం మతంల కలిపి ఆ ఆడవాళ్ళ చీరలు పంచుతారు. వాళ్ళకు తురక పేర్లు పెట్టి, వాళ్ళ పేర్లన్నీ రాసుకొని ఎందరిని మతం మార్చింది రిపోర్టు పంపుతారు. పాలకులకు భయపడి కరణం, రెడ్డి తమకిష్టం లేకపోయిన నోరు మూసుకొని వుంటారు.
కాని పట్నం నుంచి వచ్చిన నరేందర్‌జీ నవ తురకలను తిరిగి హిందువులుగా మార్చే ప్రయత్నానికి సహాయం అడుగుతే కటువుగా సమాధానమిస్తాడు. ఎవరికి తెలియకుండా యాగాలు పూజలు లేకుండా ఈ తంతు ముగించి వచ్చిన దారిన వెళ్ళమంటారు. మనమంతా హిందువులం మనందరికీ ఒకే దేవుడు. వేదకాలంలో కులాలు లేకుండే, స్వార్ధ బ్రాహ్మణులు సృష్టించినవి కులాలు, అంటరానివాడూ అంటవచ్చిన వాడు అని ఏశాస్త్రంలో లేవు, ఏ వేదం చెప్పదు. పేద తురకలు ఆకలితో అలమటిస్తుంటే మిమ్మల్ని తురకల్ని చేసి ఉద్దరిస్తరా ఇదంతా వెూసం. వాళ్ళలో షియాలు, సున్నీలు అనే కులాలున్నాయి అని వివరిస్తాడు. గంగాతీర్థం చల్లి హిందువులుగా మార్చి గాయత్రి మంత్రం చదవడంతో ప్రక్రియతో పాత పేర్లతో పిలుచుకోండని చెప్తాడు. దురలవాట్లు మానమని, శుభ్రంగా ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు.
ఈ రెండు మత మార్పిడి వల్ల నాటి ప్రజలకు కొత్తగా ఏ లాభం జరగలేదనే విషయాన్ని రచయిత వివరించాడు. స్వయంగా బ్రాహ్మణుడయి వుండి స్వార్థ బ్రాహ్మణులను విమర్శించడం, వేదాల్లో ఎక్కువ తక్కువ లేదని చెప్పడం వారి నిజాయితీకి నిదర్శనం.
లంబాడీల గురించి చెప్తూ కరణం వారిని ఎట్లా వెూసం చేసింది, నాటి పరాయి సర్కారుకు స్థానిక అధికారులు, పోలీసులు కలిసి భూస్వామ్య వ్యవస్థల్లో నిర్వహించిన అరాచకాలను వివరంగా చిత్రీకరించారు.ఈ సంఘటనలో లంబాడాల ఐక్యత, వారి శక్తి సామర్ధ్యాలు, రాతెండి గ్లాసుతో నీళ్ళిస్తే ప్రాణం పోయే స్థితిలో ఉండి కూడ తాగకపోవడం, పోలీసు స్టేషనల్లో ఎన్ని హింసలు పెట్టినా మత మార్పిడికి అంగీకరించక పోవడం అనేది దాశరథి రంగాచార్యులు లాంబాడా పట్ల గౌరవాన్ని తాను నివసించిన గ్రామాల్లో లంబాడాలతో వారికున్న అనుభవాన్ని తెలియజేస్తుంది. మిగిలిన కొందరి వలె వారిని అనాగరికులుగా చెప్పనందుకు అభినందించాలి. బీక్యా భార్య లక్ష్మి తనను తాను రక్షించుకునే తెగువ, ఆత్మరక్షణకు ఆమెను పై దాడి అతని చేతిలో మరణం తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ విశ్వాసానికి అద్దం పట్టింది.
లక్ష్మీని చంపింది ంబాడీలే అని, దోపిడీ కోసం వచ్చారని కోర్టులో చెప్పించడం, కోర్టులో న్యాయమూర్తితో సహా అందరూ నాటి ఘాతుకాలకు సహకరించడాన్ని తెలుపుతుంది. లంబాడీలపై బనాయించిన కేసులు వారి చట్టపరమైన పరిజ్ఞానానికి అద్దం పడతాయి.
తాజీరాత్ ా హైదరాబాదు శిక్ష స్మృతి ఖల్లే ా హత్య 241
హమ్లా ా దాడి 291 నర్ఖా ా దొంగతనం 341 ………. దోపిడీ 327 ( సెక్షన్లు)
స్త్రీ పాత్రలు : చిల్లర దేవుళ్ళు నవలలో స్త్రీ పాత్రల ద్వారా దాశరథి రంగాచార్యకు స్త్రీల సమస్యలపై వున్న సానుభూతి అర్థమవుతుంది. ఎక్కడ అనుచిత వర్ణన లేదు.
వనజ పాత్ర ‘‘ఆడబాప’’లుగా భూస్వాముల గడీలలో మగ్గిన మహిళల దుస్థితికి అద్దం పడుతుంది. వనజ తల్లి, నవ వధువుగా వున్నపుడే ఆమె భర్తను చంపి ఆమెను చెరపడతాడు. దేవిడిలో అందరికి విలాస వస్తువుగా వాడుకోబడి వరుస వాయి లేకుండా అందరిచేత అనుభవించబడుతుంది. ఆమె బిడ్డ వనజకు రెడ్డి బిడ్డ మంజరికి పోలికలుంటాయి కాని, వనజ దాసిగా ‘ఆడబాప’గా మగ్గుతూ వుంటుంది. సారంగపాణిపై ప్రేమను పెంచుకొని వెంటనే తనని తాను సరి చేసుకుంటుంది. అన్నగా భావిస్తాను అనుకొంటుంది. రెడ్డి వనజతో పాణిని పెళ్ళి చేసుకోమన్నపుడు వేశ్య బతుకు నుండి తప్పించుకొనేందుకు సరే అంటుంది. కాని పాణి అన్నగా అండగా వుంటానంటాడు.
వనజ వంటి స్త్రీలు సరళ, ప్రమీల, విమల ఇంకా ఎందరో వుంటారు గడీల్లో.
గౌండ్ల వీరి భార్య గౌండ్ల పుల్లి కరణానికి ంగిపోయి భర్త చావుకు కారణమవుతుంది. గౌండ్ల పుల్లి కరణానికి పుట్టిన బిడ్డ తాయారు తల్లిబాటలో వెంకటలక్ష్మీ నరసింహాచార్యులనే వైష్ణవ గురువుకు ంగిపోతుంది.
కరణం భార్య పిచ్చిది. మంగమ్మ పాత్ర ద్వారా ఆ నాటి కుటుంబాలలో పురుష స్వామ్య దాష్టికానికి బలయిన నిస్సహాయ మహిళ కనిపిస్తుంది.
రెడ్డి భార్య ఇందిర భూస్వామ్య ఆగడాలు ఆడవారిపై అత్యాచారాలను అడ్డుకోలేని గడీలల్లో స్త్రీల స్థితికి ప్రతీక.
కుమ్మరి లచ్చి వంటి వారు భూస్వాముల కామానికి బలయితే లంబాడి లక్ష్మి వంటి వారు పోలీసుల చేతుల్లో రాలిపోయారు.
‘‘ఈ దేశంల సర్కారున్నదనుకుంటున్రురో దొరలు కరణాలు రాజ్యమేలుతాన్రు. పోలీసులు వాళ్ళ చేతుల్ల కుక్కలు’’ అని పోలీసు స్టేషన్‌లో లంబాడీలతో కుమ్మరి అన్నమాట నాటి అత్యాచారాలకు అక్షర సత్యం. ఇది ఇంకా ఇప్పటికి మారలేదు మహిళల విషయంలో.
నవలలో భాష
‘చిల్లర దేవుళ్ళు’ నవలలో రచయిత తెలంగాణ మాండలీకము ఉపెూగించినా వేదాల, సంస్కృత శ్లోకాలు అక్కడక్కడ వుటంకించబడ్డాయి.
పీరిగాడి కొడుకు చింతకాయిల ఎత్తుకుపోయెప్పుడు రెడ్డి ఆగమంటె ఆగలేదని పాణితో చెప్తాడు. పాణి మాటల్లో వాల్మీకి భారవి సూక్తులు.
‘‘అప్రియస్యతు వథ్యస్య వక్తాశ్రోతా చదుర్లభారి’’ వాల్మీకి ‘‘హితం మనోహరంచ దుర్లభం వచ్ణ’’ భారవి హితకరమయిన మాట ఎపడూ తియ్యగా ఉండదు అని భావం.
దసరా పూజ సందర్భంగా
శమీ శమయతే పాపం ా శమీ శత్రు వినాశనం
అర్జునస్య దనుర్దారీ ా రామస్య ప్రియదర్శినీ ా శమీపూజ
తురకలుగా మారిన దళితుల్ని తిరిగి హిందువులుగా మారుస్తూ నరేంద్రజీ చెప్పిన వేదంలో మాట ‘నజ్యేష్ఠాసో ా నకనిష్ఠసో’ వేదాల్లో పెద్దవారు చిన్నారు అని మనుషూల్లో తేడా చెప్పలేదు.
సామెతలు
‘1) ‘బోడి ముండకు దండం పెడ్తే నావోలెనే ఉండమని దీవించిందట’’
2) పట్వారి గేదె చస్తే ఊరంతా చూడటానికి వచ్చారు కాని పట్వారి చస్తే ఒక్కరు రాలేదు అనే ఉర్దూ సామెత.
3) ‘‘చంబోర్ కే దేవర్ కో చెప్పల్ కే పూజా’’ మొదలయినవి దాశరథి గారు ఇరు భాషల్లో సామెతలుపెూగించారు.
కీర్తనలు
పాణి సంగీతం పంతులు పాడి వినిపించినట్టుగా రాసిన త్యాగరాజ కీర్తనలు పూర్తిగా వున్నాయి నవలలో.
1) బాల! కనకమయ చేల! సుజనపరిపాల శ్రీరమాలోలా………
2) ెూచనా కమలలోచన…….
3) సంగీత జ్ఞానమూ భక్తి వినా సన్మార్గము కలదే……
4) మరిమరి నిన్నే మొరలిడ నీ మనసు న దయరాదు రామా!……
5) నా జీవనాధారా! నా నోముఫలమా……
6) చక్కని రాజమార్గమే యుండగ సందుల దూరనేల మనసా!……
దాశరథి గారి కీర్తనల పట్ల అనురక్తిని తెలియచేస్తుంది.
జానపద గేయాలు
సారంగపాణి హైదరాబాదు తెల్లవారు జామున బయలు దేరినపుడు గుడిసెల్లో న్నలు దంచుతూ పాడిన పాటలు వినిపిస్తాయి అని రాసిన పాట.
1) ‘‘నువ్వన్న చుక్కలు, రాజ మామిళ్ళు
నా చేతి రోకండ్లు నల్ల రోకండ్లు’’
2) బతుకమ్మ పాటలు ా శ్రీ లక్ష్మీ నీ మహిమలూ గౌరవమ్మ చిత్రమై తోచునమ్మ.
3) ‘డ్డెమ్మ డ్డెమ్మా బిడ్డా లెందరే’’
ఉర్దూ భాషా పదాలు
ప్రభావం ఏదయినప్పటికీ నవలలో ఉర్దూ భాషా పదాలు అనేకం వున్నాయి. 270 పర భాషా పదాలు పదే పదే పునరావృతమయ్యాయి.
1969లో ‘చిల్లరదేవుళ్ళు’ దాశరథి రంగాచార్య మొదటి నవల. వారి మొదటి నవలేక కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించిందంటే వారి సాహిత్య ప్రశస్థి వేరే చెప్పనవసరం లేదు. వ1974లో ‘‘చిల్లరదేవుళ్ళు’’ నవల అదే పేరుతో సినిమాగా వచ్చింది.
వారి నవలలు
1969 ా చిల్లర దేవుళ్ళు, 1971 ా వెూదుగుపూలు, 1976 ా జనపదం, 1971 ా మాయాజలతారు
1971 ా రానున్నది ఏది నిజం, 1980 ా మానవత, 1980 ా శరతల్ప
ఇవికాక శ్రీమద్భాగవతం, సీతాచరిత వంటి కావ్యాలు రాశారు. వేదాలను తెనిగించారు.
నామాలు పెట్టుకున్న ఈ కమ్యూనిస్టు దాశరథి రంగాచార్య ప్రగతిశీలురిగా, అభ్యుదయ వాదిగా, భాషావేత్తగా, ఉద్యమకారునిగా మొత్తంగా తెలంగాణ బిడ్డగా గర్వించదగ్గ వ్యక్తి.
‘‘చిల్లరదేవుళ్ళు’’ నవలలో వర్ణించిన పరిస్థితులూ ఇంకా కొనసాగుతుండడం ఆ నవల సార్వకాలీనతకు ప్రతీక.
నిని
ా జ్వలిత, 9989198943
అక్షరవనం, ఫ్లాట్ నెం. 202
శేషసాయి ఫ్యారడైజ్,
విజయనగర్‌కాలనీ ా2,
ఖమ్మం. ా 507 002.
ఎఱశ్రీ ఱస: షశ్రీఱ్‌ష్ట్ర2020ఏఎఱశ్రీ.శీఎ

Reviews

There are no reviews yet.

Be the first to review “చిల్లర దేవుళ్ళు
జ్వలిత”

Your email address will not be published. Required fields are marked *