చిలుక ఎగిరిపోతోంది
కోవెల సంతోష్ కుమార్

నిన్న ఉన్నట్లుగా ఇవాళ లేదు
రేపు ఉన్నట్లుగా ఎల్లుండి ఉండట్లేదు
శరీరంలో మార్పులు…
తలపుల్లో మార్పులు
నడకలో మార్పులు
నడతలో మార్పులు
కాలేజీలో తొలి అడుగు
కేరెక్టర్‌లో సరికొత్త మలుపు
ఆమె అతను కావాలి..
అతనితోనే చనువు కావాలి..
చనువుతోని స్నేహం కావాలి
స్నేహంలోని ఆకర్షణ కావాలి
వాళ్లతోనే ఫ్రెండ్లీనెస్‌..
ఆ స్నేహంలో తెలియనిదేదో ఓ ఫీల్‌
టీనేజీ లైఫ్‌లో అదో థ్రిల్‌
స్నేహానికి హద్దులు లేవు
సరదాలకు నో లిమిట్స్‌
ఒద్దికకు.. అణుకువలకు చోటు లేదు
కలిసి తిరిగితే తప్పు లేదు..
తిరగకపోతే లైఫే వేస్టు
బాయ్‌ఫ్రెండ్‌ లేని గాళ్‌ కూడా ఉంటుందా?
ఫన్‌ అంతా మగాళ్లకేనా?
మాకేం తక్కువ
మా డ్రెస్‌కోడ్‌ మాది..
మా లైఫ్‌సెユ్టల్‌ మాది..
క్లబ్బులు..పబ్బులు..
పార్కులు.. షికార్లు…
అన్నీ మేమూ చేస్తాం…
బాయ్‌ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌ చేస్తాం..
వై నాట్‌..
ఆమె బల్లగుద్ది చెప్తోంది
తాను మారానని
ఆమె రెక్కలు రెపరెపలాడుతున్నాయి
కోయిల రమ్మంటోంది
ఆమె ఎగిరిపోతోంది

Reviews

There are no reviews yet.

Be the first to review “చిలుక ఎగిరిపోతోంది
కోవెల సంతోష్ కుమార్”

Your email address will not be published. Required fields are marked *