గుస్పాడీ ఆటపాట
కోవెల సంతోష్ కుమార్

Category:

నాగరక పట్టణాల్లో ప్రజలకు సినిమాల్లో అర్ధ నగ్న నృత్యాలు… పాశ్చాత్యపు ఆటపాటలు తప్ప… అడవిలో… అడవితల్లి బిడ్డల సహజ నృత్యాల గురించి తెలిసింది చాలా తక్కువ.. ఏజెన్సీ ప్రాంతాల్లో సహజసిద్ధంగా తయారు చేసుకున్న వాయిద్యాలతో, సంప్రదాయ వేష ధారణలతో… లయబద్ధంగా సాగే వాళ్ల ఆటపాటలు… ప్రకృతితో మమేకమైన జనజీవనం అపురూపం… నాగరిక జనులు ఎంత ఖర్చు చేసినా అందని ఆనందం అది…ఆటపాటలు.. గిరిజన సంస్కృతిలో విడదీయలేని భాగాలు.. ఏజెన్సీ ప్రాంతాల్లో చిన్న చిన్న పండుగలు వచ్చినా, ఆటపాటలకు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.. పట్టణాల్లో పార్టీ అంటే డిజె…లు.. రెయిన్ డాన్స్‌లు,, మద్యం మత్తుల్లో మునిగి తేలే సంస్కృతి ఇంకా ఒంటబట్టని గిరిజనులకు ప్రకృతి నేర్పిన డాన్సులు.. ప్రకృతి సిద్ధమైన సంగీతం… అందుకు అనుగుణంగా పాడుకునే పాటలే ఆనందాన్ని ఇస్తాయి… ఇక్కడ మనం దీపావళి జరుపుకుంటాం… ఆదిలాబాద్ ఏజెన్సీలో గిరిజనులు దండారి పండుగ జరుపుకుంటారు.. దండారి నృత్యాలు చేస్తారు… ఈ సందర్భంగా గిరిపుత్రులు గుస్పాడీ దీక్షను స్వీకరిస్తారు.. ఒంటికి మేకతోలు చుట్టుకుని ఒళ్లంతా బూడిద రాసుకుని తలపై నెమలి ఈకల కిరీటాన్ని ధరిస్తారు.. మెడలో కరక్కాయలు, పూసల దండలు ఉండనే ఉంటాయి. గుస్పాడీ, చచా్చూ నృత్యాలు వీరి ప్రదర్శనల్లో ప్రధానమైనవి..ఘల్లు ఘల్లున మోగే గజ్జెల సవ్వడుల మధ్య సాగే ఆటపాటల కోలాహలంతో గోండు గూడేలు మార్మ్రోగుతుంటాయి. గుస్పాడీ దీక్షలు గిరిజనుల గూడేల్లో ఆరోగ్య వాతావరణాన్ని సృష్టిస్తాయని, దీర్ఘకాలిక వ్యాదులు దూరమవుతాయని అడవి పుత్రుల విశ్వాసం…ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లా.. గిరిజనులే ప్రధానంగా జనాభాగా ఉన్న జిల్లా… అందులోనూ గోండులు ఎక్కువగా నివసించే జిల్లా… తెలంగాణ, మహారాష్ట్ర, సంస్కృతుల మేలు కలయిక ఉన్న జిల్లా… ఈ గోండులకు బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు ఉండవు.. వారు కోరుకోరు.. నాగరిక జనాల్ని వారు పట్టించుకోరు.. అడవి తల్లి అందించిన సంపదే వారికి జీవనాధారం.. అక్కడే వారి జీవితం. అదే వారి ప్రపంచం. ఆదిలాబాద్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతం ఇది… ప్రతి అణువూ పచ్చదనంతో అలరారే ఈ ప్రాంతం గిరిజనులకు అందమైన ఆవాస ప్రదేశం… లంబాడాలు, గోండులు, కోలారి జాతులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు.. .వీరి జీవన విధానం, సంప్రదాయాలు, నమ్మకాలు.. మనకు వింతగా తోచవచ్చు.. విచిత్రమనిపించవచ్చు… కానీ, వీరికవేం పట్టవు.. తమ పద్ధతుల్లో.. తమ పండుగలను… తమ స్థాయిలో… ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు…పండుగ సంబరాలను మిగతా ప్రపంచానికి భిన్నంగా జరుపుకోవటం వీరి ప్రత్యేకత. దండారి పండుగ అయిదు రోజుల పాటు జరుగుతుంది. గుస్పాడీ దీక్ష తీసుకున్న గిరిజనులను ఒక గూడెం నుంచి మరో గూడేనికి తరలి వెళ్లడం, ఆ గూడెం వారు అతిథి మర్యాదలు చేయటం. మహా సందడిగా ఉంటుంది. ఉదయం పూజతో ప్రారంభమయ్యే దండారీ, అర్ధరాత్రి వరకూ నృత్యగానాలతో కొనసాగుతూనే ఉంటుంది. గిరిజనుల ఈ ఆనంద నృత్యాలతో అడవితల్లి పులకిస్తుంది…..

Reviews

There are no reviews yet.

Be the first to review “గుస్పాడీ ఆటపాట
కోవెల సంతోష్ కుమార్”

Your email address will not be published. Required fields are marked *