గాలి మార్పు
కోవెల సంతోష్ కుమార్

Category:

గాలి మారితే బాగుటుంది అనే మాట మనం అంతా జనరల్‌గా ఎప్పుడూ మాట్లాడుకునే మాట. మానసికంగా సరిగా లేకపోయినా, శారీరకంగా బాగో లేకపోయినా, పనిలో ఒత్తిడి ఉన్నా మళ్లీ సరి కావటానికి, బాగుపడటానికి, రిచార్జ్ కావటానికి ఉన్నచోటు నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్తే గాలి మార్పు ఉంటుంది. ఈ మార్పు వాతావరణంలో కాదు.. మనసులోనూ కూడా జరుగుతుంది. ఉల్లాసం.. ఉత్సాహం.. ప్రశాంతత..మనశ్శాంతి.. కొత్త విషయాలపై ఆసక్తి.. చూసే, నేర్చుకునే, అనుభవించే అవకాశం అన్నీ లభిస్తాయి. కొన్నాళ్ల పాటు ఎక్కడికైనా వెళ్లొస్తే హాయిగా ఉంటుందనేది సాధారణంగా మనం అనుకుంటాం. ఓ గుడికి పోతే మనసు ప్రశాంతమవుతుంది. ఒక నదికి పోతే ఆ నీటిని చూసి అందులో స్నానం చేస్తే ఆనందంగా ఉంటుంది. సముద్రం చెంతకు వెళ్తే ఎగిసిపడే అలలను చూస్తే మన మనస్సూ ఎగిసెగిసి పడుతూ కేరింతలు కొడుతుంది. ఒక అడవికి పోతే ఆ పచ్చదనాన్ని చూసి పరవశం కలుగుతుంది. నిత్యం మనిషిని చూసి విసుగెత్తి పోయే మనకు ఆ అడవిలో అమాయకంగా, తమ మానాన తాము బతుకుతున్న మనిషి కాని ఇతర జీవ జాలాన్ని చూసినప్పుడు ఆసక్తి కలుగుతుంది. కంప్యూటర్లకూ, కాంక్రీట్ గోడలకు దూరంగా ఎక్కడో ఏజెన్సీలో నాగరిక ప్రపంచానికి దూరంగా దొరికిన అడవి సంపదను తింటూ, సినిమాలు తెలియక.. షికార్లు తెలియక, టెలివిజన్లు ఉంటాయన్న విషయమే తెలియక, తమలో తామే ఆడుకుంటూ, పాడుకుంటూ అదే వినోదంగా, కష్టమేమీ తెలియకుండా ఆనందంగా జీవితాలను గడుపుతున్న వివిధ తెగల ప్రజలను, వారి జన జీవనాన్ని అకస్మాత్తుగా చూసినప్పుడు ఆశ్చర్యమేస్తుంది. మనకు తెలియని ఒక కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు ఒక వినూత్నమైన అనుభూతి కలుగుతుంది. అదే గాలిమార్పు. ఈ గాలి మార్పు కోసం మనం చేసే ప్రయాణానికి మన మేధావులు పెట్టిన పేరు పర్యాటకం. మరో భాషలో టూరిజం.
టూరిజం అంటే ట్రావెల్ ఎక్స్పీరియన్స్. మన ప్రయాణ అనుభూతే పర్యాటకానికి నిర్వచనం. మనిషి పుట్టినప్పటి నుంచీ నిరంతరంగా ఒక చోటి నుంచి మరో చోటికి తానున్నచోటు నుంచి వెళ్లి రావటమే.. వెళ్తూ ముందుకు సాగటవెూ చేస్తూనే ఉన్నాడు. ఆహారం కోసవెూ, నీటి కోసవెూ, సురక్షితంగా బతకడం కోసవెూ, వ్యాపారం కోసవెూ వెళ్తూనే ఉన్నాడు. వీటన్నింటి వెనుకా మనిషి లక్ష్యం ఒక్కటే. ఆనందం.. సంతోషం.. మనిషి ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా ఈ ఆనందం కోసమే. ఈ ఉత్సాహం కోసమే. ఇవాళ ప్రపంచంలో టూరిజం అనేది ఒక పెద్ద పరిశ్రమగా పురోగతి సాధించిందంటే.. ఈ ఆనందాన్ని అందించటం అన్నది టార్గెట్ చేసుకునేనన్నది స్పష్టం. మొదట్లో రాజులు, రాజరికపు వ్యవస్థలు ఉన్నప్పుడు వేటకు వెళ్లటం ప్రధానంగా ఉండేది. ఆ రోజుల్లో వారికి అదే పెద్ద విహార యాత్ర.. సాహస యాత్ర. నిన్న మొన్నటి సంస్థానాధీశుల వరకూ ఊరు విడిచి మరో చోటికి వెళ్లటం అంటే వేటకు వెళ్లటమే. ఇప్పుడు టూరిజం అన్నది అనేక రకాలుగా విస్తరించింది. అనేక కార్యకలాపాల సమష్టి వినోద, విహార యాత్రగా టూరిజం మారింది. వివిధ రకాల సేవలు, పరిశ్రమలు, రవాణా, వసతి, ఆహార వ్యవస్థలు, రిటైల్ షాప్‌లు, వినోదరంగ వ్యాపారాలు అన్నీ కలిసి పర్యాటక అనుభూతిని అందిస్తున్నాయి.
1982లోనే మాథెసన్ అండ్ వాల్ టూరిజంకి అద్భుతమైన నిర్వచనాన్ని అందించింది. ని్‌ష్ట్రవ ్‌వఎజూశీతీతీవ ఎశీఙవఎవఅ్ శీ జూవశీజూశ్రీవ ్‌శీ సవర్‌ఱఅ్‌ఱశీఅర శీ్‌రఱసవ ్‌ష్ట్రవఱతీ అశీతీఎశ్రీ జూశ్రీవర శీ షశీతీ అస తీవరఱసవఅవ. ్‌ష్ట్రవ ్‌ఱఙఱ్‌ఱవర అసవతీ్‌వఅ సతీఱఅ ్‌ష్ట్రవఱతీ ర్‌వ ఱఅ ్‌ష్ట్రశీరవ సవర్‌ఱఅ్‌ఱశీఅర, అస ్‌ష్ట్రవ ఱశ్రీఱ్‌ఱవర తీవ్‌వస ్‌శీ ్‌వతీ ్‌శీ ్‌ష్ట్రవఱతీ అవవసర.ు ఇది నిజం. మనం మన సాధారణ రోజూ వారీ జీవితం నుంచి తాత్కాలికంగా దూరమవుతూ ఒక సంతోషాన్ని, ఆనందాన్ని, ఉల్లాసాన్ని వెతుక్కుంటూ వెళ్లటమే టూరిజం.
ఇవాళ టూరిజం అన్నది ప్రపంచంలో అతి పెద్ద పరిశ్రమ. దాదాపు మూడు ట్రిలియన్ డాలర్ల వ్యాపారాన్ని ఈ పరిశ్రమ చేస్తోంది. కొన్ని చిన్న దేశాల ఆర్థిక వ్యవస్థలు టూరిజంపైనే ఆధారపడి ఉన్నాయి. పర్యాటకులను ఆకర్శించటమే ప్రధాన లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి.
మన దేశం విషయానికే వస్తే ఇక్కడ టూరిజంకు పనికిరాని ప్రదేశం అంటూ ఒక్కటి కూడా కనిపించదు. ప్రపంచంలో ఏ దేశానికి లేని ప్రాకృతిక, ఆధ్యాత్మిక, సాంసృ్కతిక, చారిత్రక సంపద అంతా ఇక్కడ పోగుపడి ఉంది. ఆసేతు హిమాచలం అనే పెద్ద పదాలు అక్కర్లేదు కానీ, ఉత్తరాన హిమాలయాలు.. కాశ్మీర్‌లో దాల్ లేక్, ఉత్తరాఖండ్‌లో నైనిటాల్, ఈశాన్యంలో సప్త రాష్ట్రాలు, తూర్పున కలకత్తా కాళి, పశ్చిమ కనుమల్లో ఘాట్‌రోడ్లపై ప్రయాణం, కొండప్రాంతాలైన ఊటీ, కొడైకెనాల్, మున్నార్‌లు, గోవాలో కాసినోల హడావుడి, పూణె టు మంగళూరు గోవా బీచ్ రోడ్డుపై అలలు మీదకు వస్తుంటే లాంగ్ డ్రైవ్ అనుభూతి.. దక్షిణాన పంచారామాలు, కోనసీమలు..కొబ్బరికాయలు, అమరావతి నుంచి అంతర్వేది వరకు.. సింహాద్రి అప్పన్న నుంచి తిరుపతి వెంకన్న దాకా.. వరంగల్లు బొగత జలపాతాల నుంచి భద్రాద్రి రామయ్య దాకా.. కన్నడ రాజ్యంలో కిష్కింధ, గోమఠేశ్వరుడు, బేలూరు, హలేబీడు, ధర్మస్థల.. దాకా మసాల పంటల సువాసనలు గుప్పు మంటుంటే సనసన్నని చినుకులు పడుతుంటే, పొడవాటి చెట్ల మధ్య నుంచి ప్రయాణం చేస్తున్న అనుభవం.. తమిళ దేశాన కంచి కామాక్షి నుంచి కన్యాకుమారి దాకా.. రామకృష్ణమఠం నుంచి రమణ మహర్షి ఆశ్రమం దాకా.. ఒకటా రెండా.. నదులు, సముద్రాలు, అడవులు, ఆలయాలు, తోటలు, పొలాలు, చెరువులు. కొండలు, కోనలు.. ఆధ్యాత్మిక వేత్తలు, తత్త్వవేత్తలు నడయాడిన ప్రాంతాలు.. ఎన్నో.. ఎన్నెన్నో.. ప్రతిచోటా.. ప్రతి ఊర్లో.. సరికొత్త అనుభూతి కలగకుండా, అనుభవించకుండా రావటం సాధ్యపడదు. వందల టన్నుల రాళ్లను గోపురాలుగా నిలబెట్టిన టెక్నాలజీని చూస్తే వేల ఏళ్లనాటి సాంకేతిక విస్మయం కలిగిస్తుంది. గోదావరి పరవళ్ల వెంట కొబ్బరి తోటల నడుమ..పురివిప్పుకున్న ప్రకృతి శోభ అపూర్వమైన ప్రశాంతతను అందిసుంది. అెబిలం అడవుల్లో ట్రెకింగ్, ఏటూరు నాగారం అడవుల్లో జలపాతాలు, పోచంపాడు నుంచి పోలవరం వరకు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు.. ఎన్నింటి గురించి చెప్పుకున్నా అంతుండదు.
ఇది పైపైన చూస్తే పర్యాటకం ఒక పరిశ్రమగా, పదిమందికి అన్నం పెట్టేదిగా కనిపిస్తుంది. కానీ, మనకు రైతు అన్నం పెట్టి బతుకునిస్తున్నాడో.. పర్యాటక రంగం మన మనసులను ఉల్లాస పరచి, మెదడులోని అన్ని టెన్షన్లను తగ్గించి ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఏడాదిలో ఒకటి రెండు సార్లు ప్రతి ఒక్కరూ గాలి మార్పును కోరుకోవాలి. కంప్యూటర్లు, కాంక్రీటు గోడలకు దూరంగా టెలివిజన్లు, సెల్‌ఫోన్ల సిగ్నల్స్ అందనంత దూరంగా వెళ్లి సహజమైన ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించాలి. రోజూ కనిపించే మనుషూలకు దూరంగా కొత్త సమాజాలను, అక్కడి జీవన వైవిధ్యాలను గమనించాలి. ఇవన్నీ మనకు జీవితంలో అనందంతో పాటు పాఠాలనూ నేర్పిస్తాయి. జీవితాన్ని, దాని శైలిని మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే ట్రావెల్ అన్నది ఒక అనుభూతి.. ఒక ఆనందం.. ఒక అవకాశం…
కోవెల సంతోష్ కుమార్

Reviews

There are no reviews yet.

Be the first to review “గాలి మార్పు
కోవెల సంతోష్ కుమార్”

Your email address will not be published. Required fields are marked *