కామాయని
పాండురంగారావు

హిందీమూలం జయశంకర ప్రసాద్
తెలుగుసేత ఇలపావులూరి పాండురంగారావు
ఉత్తరమున ఉత్తుంగ హిమాచల
శిఖర శిలాతల శీతల సీమల
కనులు చెమ్మగిల కాంచుచుండె నొక
పురుషుడెవడొ ప్రళయాంబుపూరమును

క్రింద జలము పై పైని తుషారము
తరళ మొకటి నఘనము మరి యొక్కటి
తత్త్వ మొకటె రెండింటికి మూలము
అదియె జడము చేతనమును కానగు

విస్తరించినది దిగ్దిగంతముల
స్తంభించిన హిమ మతని యెడద వలె
సదు్దలేక ప్రస్తర చరణములకు
తవిలి మరలు మరి మరి పవమానము

హర విలాస భువి నాత్మలోలుడగు
తరుణ తాపసుని కరణి వవాని చని
వెలయ ప్రళయ పాథోధి కెరటములు
ఒదిగియున్న పడుగున సదయమ్ముగ

ఆ తపస్వి ఆజాను బాహు వా
దీర్ఘ దేహువలె దేవ దారువులు
జంట జంటలుగ చలికి శిలల వలె
నిలచి యున్న వట పాలిపోయినటు

అతని తేజమాపాద మస్తకము
వెల్లి విరియ మాంసల మృదు గాత్రము
తీర్చి దిద్దినటు దీప్తి చెందినది
స్వచ్ఛ రక్త సంచార మనోజ్నము

పురుష రూప పౌరుష మన నొప్పిన
అతని వదనమున వేదన చిందెను
అంతరంగమున పారుచుండె నే
మరి లే బ్రాయపు మధుర తరంగిణి

ఆశ్రయించె వటరాజము నొక తరి
దరి జేరితి నను ధైర్య బలమ్మున
ప్రళయ జలము లలనల్లన తీయగ
పుడమి అపుడె పొడచూప సాగినది

అంతట వెలువడె నంతర్వేదన
విగలిత కరుణాఖ్యానము పోలిక
ఒంటరిగా వినుచున్నది నవ్వుచు
ప్రకృతి అంతయును గమనించెనొ యన

Reviews

There are no reviews yet.

Be the first to review “కామాయని
పాండురంగారావు”

Your email address will not be published. Required fields are marked *